Palash Flower Puja Tips: జాతకంలో శని, కుజ దోషం ఉందా.. మోదుగ పువ్వులతో ఈ పరిహారాలను చేసి చూడండి..

|

May 26, 2023 | 9:46 AM

దేవతలకు వారి వారి స్వభావాన్ని బట్టి పుష్పాలు సమర్పిస్తారు. భగవంతుడికి ప్రీతికరమైన పువ్వులు ఉన్నాయి. అయితే లక్ష్మీదేవిని ఓ పువ్వుతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహంతో పేదవాడు కూడా ధనవంతుడవుతాడని విశ్వాసం. ఈ రోజు ఆ పువ్వు ఏమిటో పూజా విధానం గురించి తెలుసుకుందాం.. 

Palash Flower Puja Tips: జాతకంలో శని, కుజ దోషం ఉందా.. మోదుగ పువ్వులతో ఈ పరిహారాలను చేసి చూడండి..
Palash Flower Puja Tips
Follow us on

పువ్వులు లేని పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. భగవంతుని ఆశీస్సులు పొందేందుకు , ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి పూలను సమర్పిస్తారు. పువ్వులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. తమ సువాసనతో మనసుని ఆహ్లాదంగా మార్చడమే కాదు.. తమ అందంతో ఇంటికి అందాన్ని తీసుకొస్తాయి. కుండా జీవితంలో సానుకూలతను వ్యాప్తి చేస్తాయి. సనాతన ధర్మంలో పూజ సమయంలో తప్పనిసరిగా పువ్వులతో పూజను చేయాలి. అందుకనే దేవుడికి ప్రీతిపాత్రమైన పూలను పూజ సమయంలో తప్పకుండా సమర్పిస్తారు. దేవతలకు వారి వారి స్వభావాన్ని బట్టి పుష్పాలు సమర్పిస్తారు. భగవంతుడికి ప్రీతికరమైన పువ్వులు ఉన్నాయి. అయితే లక్ష్మీదేవిని ఓ పువ్వుతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహంతో పేదవాడు కూడా ధనవంతుడవుతాడని విశ్వాసం. ఈ రోజు ఆ పువ్వు ఏమిటో పూజా విధానం గురించి తెలుసుకుందాం..

మోదుగ పువ్వు.. లేదా పలాస పుష్పానికి లక్ష్మీదేవికి మధ్యగల సంబంధం

లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవాలంటే.. శుక్రవారం రోజున ఐశ్వర్య దేవతకు మోదుగ పువ్వుతో పూజ చేయండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది. సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. ఆర్ధిక ఇబ్బందులు కలగవు. ఇంట్లో మోదుగ చెట్టును పెంచుకోవడం చాలా శ్రేయస్కరం. లక్ష్మి దేవికి ఈ పువ్వు ఎంతో ప్రీతికరమైనదని చెబుతారు.

ఇవి కూడా చదవండి

మోదుగ పువ్వుల విశిష్టత ఏమిటంటే? 

పలాస పువ్వులు ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా ధన్య ధాన్యాలను కూడా పెంచుతాయి. ముందుగా మోదుగ పువ్వులను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి, ఆపై అల్మారా లేదా డబ్బులు పెట్టె బాక్స్ లో ఉంచండి. ఇలా చేయడం వల్ల డబ్బు సమస్య తీరుతుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది.

మానసికంగా ఇబ్బంది పడుతుంటే మోదుగ పువ్వులు మంచి ఉపశమనం ఇస్తాయి. నిద్రపోయే సమయంలో దిండు కింద మోదుగ  పువ్వులను ఉంచుకోండి. లేదా మీ దిండు దగ్గర పూల గుత్తిని ఉంచవచ్చు, ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది. ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది.

ఆరోగ్యాన్ని ఇచ్చే మోదుగ పువ్వులు.. 

వ్యాధిగ్రస్తులకు కూడా మోదుగ పువ్వు మంచి మెడిసిన్.. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడేవారు.. ఎంత చికిత్స తీసుకున్నా ఆరోగ్యం మెరుగుపడని వారు పలాస చెట్టు వేరుతో ఈ పరిహారం చేసి చూడండి. చెట్టు వేరు చుట్టూ పత్తి దారాన్ని చుట్టి, ఆపై కుడి చేతిలో కట్టుకోండి. ఈ పరిహారంతో వ్యాధి నయం కావడం ప్రారంభమవుతుంది.

శనీశ్వరుడి అనుగ్రహం  

ఎవరి జాతకంలోనైనా శని దోషం ఉండి జీవితంలో సమస్యలు ఏర్పడతాయి.  శనీశ్వరుడు చెడు దృష్టిని  నివారించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విజయం సాధించలేకపోతే.. మోదుగు పుష్పం పరిహారం  జీవితానికి సంతోషాన్ని ఇస్తుంది. శనీశ్వరుడికి నల్ల నువ్వులతో పాటు పలాస పువ్వులు సమర్పించడం ద్వారా శని ఇచ్చే దుష్ఫలితాలు తొలగిపోతాయి. జాతకంలో కుజుడు స్థానం నీచ స్థితిలో ఉంటే 21వ మంగళవారాలు మోదుగ పుష్పాలను బజరంగబలికి సమర్పించినట్లయితే.. కుజుడు స్థానం మెరుగుపడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).