కరోనా (covid19) విజృంభిస్తోన్న నేపథ్యంలో శ్రీశైలం(Srisailam) మల్లన్న స్వామి దర్శనానికి పూర్తిస్థాయిలో ఆన్ లైన్ (Online Darshan) విధానం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి (జనవరి25) అన్ని రకాల దర్శనం టికెట్లను ఆన్ లైన్ లోనే పొందేలా ఆలయాధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ క్రమంలో శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు ఉచిత దర్శనంతో పాటు రూ.150, రూ.300 దర్శనం టికెట్లు, ఆర్జిత సేవల టిక్కెట్లు కూడా ఆన్ లైన్ ద్వారానే పొందాల్సి ఉం టుంది. టికెట్ బుక్ చేసుకోవడానికి, దర్శనానికి సంబంధించి అదనపు సమాచారం కోసం భక్తులు తమ అధికారిక వెబ్ సైట్ ను చూడాలని ఆలయాధికారులు సూచించారు.
ఈ నిబంధనలు తప్పనిసరి..
కాగా మల్లన్న స్వామి దర్శనం కోసం వచ్చే వారు కొవిడ్ వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రం లేదా కొవిడ్ నెగెటివ్ రిపోర్టును కూడా ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. కాగా కరోనా వ్యాప్తి నిర్మూలనకు, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు చేకూరాలనే సంకల్పంతో దేవదాయశాఖ ఆదేశాల మేరకు శ్రీశైలంలో హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఈరోజు నుంచి వారం రోజుల పాటు మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, ఆయుష్య హోమం, శీతాల దేవి హోమాలు జరపునున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
Also Read:
Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నేడు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Sai Pallavi: అందాల నెమలి సాయిపల్లవి.. ఆ పాటకోసం ఎంత కష్టపడిందో చూడండి..