Tirumala: తిరుమల గగనతలంలోకి మరోసారి విమానాలు.. చక్కర్లు కొట్టడంపై భక్తుల విస్మయం

|

Jun 29, 2023 | 6:00 PM

Flight Fly Over Tirumala: ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం, పరిసరాలపై విమానాలు ప్రయాణించడం నిషిద్ధం ఉంది. అయితే, గత కొన్ని నెలల వ్యవధిలోనే పలుమార్లు శ్రీవారి ఆలయంపై విమానాలు వెళ్లడం సంచలనంగా మారింది. తాజాగా మరోసారి నిబంధనలను పక్కన పెట్టి రెండు విమానాలు తిరుమల కొండలపై

Tirumala: తిరుమల గగనతలంలోకి మరోసారి విమానాలు.. చక్కర్లు కొట్టడంపై భక్తుల విస్మయం
Tirumala Tirupati
Follow us on

తిరుమల, జూన్ 29: తిరుమల కొండలపై విమనాలు మరో మరోసారి చక్కర్లు కొట్టాయి. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం, పరిసరాలపై విమానాలు ప్రయాణించడం నిషిద్ధం ఉంది. అయితే, గత కొన్ని నెలల వ్యవధిలోనే పలుమార్లు శ్రీవారి ఆలయంపై విమానాలు వెళ్లడం సంచలనంగా మారింది. తాజాగా మరోసారి నిబంధనలను పక్కన పెట్టి రెండు విమానాలు తిరుమల కొండలపై నుంచి తిరిగాయి. ఓ విమానం ఆలయ గోపురం, గొల్ల మంటపానికి మధ్యలో ప్రయాణించినట్లుగా తెలుస్తోంది. మరో విమానం ఆలయ సమీపం నుంచి వెళ్లిందని సామాచారం. తరచూ తిరుమల కొండలపై విమానాలు తిరుగుతుండటంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా ఆనంద నిలయం సమీపంలో విమానాలు చక్కర్లు కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. విమాన గోపురంపై విమానాల రాకపోకలు ఆగమ శాస్త్ర విరుద్ధమని పండితులు వినిపిస్తున్నారు.

విండ్ డైరెక్షన్ బట్టి తిరుమల కొండపై రెగ్యులర్ ఫ్లైట్స్ రాకపోకలు సాగేలా రూట్ మార్చేస్తోందని భావిస్తున్నారు భక్తులు. తిరుమల కొండల్ని ఇప్పటి దాకా నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణించలేదన్నారు ఏవియేషన్ అధికారులు. అసలు నో ఫ్లయింగ్ జోన్ ప్రతిపాదనే లేదని స్పష్టం చేశారు. అభ్యర్థిస్తే కేంద్ర విమానయాన సంస్థ పరిశీలిస్తుందని చెబుతున్నారు తిరుపతి ఎయిర్‌పోర్ట్ అధికారులు. మరోవైపు నో ఫ్లయింగ్ జోన్ అంశంపై ఇంతవరకు టీటీడీ సెక్యూరిటీ అధికారులు స్పందించలేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం