హిందూ సంప్రదాయంలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. హిందువుల ఇళ్లలో తప్పనిసరిగా తులసి మొక్క ఉంటుంది. ఇంట్లో తులసి మొక్క ఉందంటే సాక్ష్యాత్తు లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉన్నట్లేనని నమ్ముతుంటారు. చాలామంది తులసికి నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు. ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తుంటారు. ఇంట్లో తులసి ఎంత పచ్చగా ఉంటే ఆ ఇల్లు శ్రేయస్సు, ఆనందంతో నిండి ఉంటుంది. అలాంటి ఇంట్లో ఎప్పుడూ సుఖసంతోషాలు ఉంటాయి. పచ్చని తులసి ఉన్న ఇల్లూ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉంటుంది.
హిందూమతంలో తులసి మొక్కను లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. అందుకే తులసి మొక్క ఉన్నచోట లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. కానీ కొన్నిరోజుల్లో తులసి మొక్కను నాటడం వల్ల కుటుంబానికి అదృష్టానికి బదులుగా దురదృష్టం కలుగుతుందని వాస్తు చెబుతోంది. కాబట్టి తులసి మొక్కను ఏ రోజుల్లో నాటకూడదో తెలుసుకుందాం.
ఈ రోజున తులసిని నాటకూడదు:
హిందూమతంలో ఏ పని చేపట్టాలన్నా, పూజ చేయాలన్నా పవిత్రమైన రోజులు, శుభ సమయాలు చూస్తుంటారు. అదేవిధంగా, తులసి మొక్కను నాటడానికి శాస్త్రంలో ఒక శుభ దినం ఉంది. సోమ, బుధ, ఆదివారాల్లో తులసిని నాటకూడదని శాస్త్రాలలో చెప్పబడింది. ఆదివారాల్లో తులసిని తాకకూడదు.
ఏకాదశి రోజు:
ఈ రోజుల్లో కాకుండా ఏకాదశి నాడు కూడా తులసి మొక్కను నాటకూడదు. కానీ ఏకాదశి రోజున విష్ణుపూజలో తులసి రేకులను సమర్పించాలి. ఇందుకోసం ఒకరోజు ముందు తులసిని కోసి పెట్టుకోవాలి.
గ్రహణం రోజు:
సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం రోజున తులసిని నాటకూడదు. సూర్యగ్రహణమైనా, చంద్రగ్రహణమైనా.. గ్రహణం రోజు తులసి రేకులను తాగే నీటిలో వేస్తే గ్రహణ దుష్ప్రభావాల ప్రభావం ఉండదని విశ్వాసం. అయితే, ఈ రోజున మీరు తులసి మొక్కను తాకకూడదు. గ్రహణానికి ఒక రోజు ముందు తులసి ఆకులను తీసి పెట్టుకోవాలి.
గురువారం:
కొత్త తులసి మొక్కను నాటడానికి గురువారం శుభప్రదంగా భావిస్తారు. గురువారం విష్ణువుకు అంకితం చేయబడింది. తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది. అందుకే గురువారం నాడు తులసిని నాటడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతుంటారు.
శుక్రవారం, శనివారం:
గురువారం కాకుండా శుక్ర, శనివారాల్లో తులసి మొక్కను నాటవచ్చు. శనివారం రోజున తులసి మొక్కను నాటితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మరోవైపు, శుక్రవారం నాడు తులసి మొక్కను నాటడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి.
కార్తీక మాసం:
అంతేకాకుండా, కార్తీక మాసం తులసిని నాటడానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కార్తీక మాసంలో ఇంట్లో తులసి మొక్కను నాటుకుని సాయంత్రం పూట తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)