- Telugu News Photo Gallery Spiritual photos Ganga Pushkaralu 2023: know the details of Kashi Pushkaralu, it's Location and Bathing Ghats
Ganga Pushkaralu: పుష్కరాలకు ముస్తాబవుతున్న గంగమ్మ.. కాశి క్షేత్ర విశేషాలు.. స్నానం చేయాల్సిన ఘాట్స్.. వివరాలు మీకోసం
నదులను హిందువులు దైవంగా భావించి కొలుస్తారు. పూజిస్తారు. ఇక పుష్కర సమయంలో నదుల్లో స్నానం చేయడం కోసం ఎంతదూరమైనా ప్రయాణిస్తున్నారు. తమకు నదుల పట్ల ఉన్న భక్తిశ్రద్ధలు వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో నదీ పుష్కరాలలో గంగానదికి కాశీ, యమునానదికి ప్రయాగరాజ్, గోదావరికి రాజమందహేద్రవరం, కృష్ణానదికి విజయవాడ ప్రసిద్ధి గాంచాయి.
Updated on: Apr 18, 2023 | 5:09 PM

నదులను హిందువులు దైవంగా భావించి కొలుస్తారు. పూజిస్తారు. ఇక పుష్కర సమయంలో నదుల్లో స్నానం చేయడం కోసం ఎంతదూరమైనా ప్రయాణిస్తున్నారు. తమకు నదుల పట్ల ఉన్న భక్తిశ్రద్ధలు వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో నదీ పుష్కరాలలో గంగానదికి కాశీ, యమునానదికి ప్రయాగరాజ్, గోదావరికి రాజమందహేద్రవరం, కృష్ణానదికి విజయవాడ ప్రసిద్ధి గాంచాయి.

గంగానది పరీవాహక ప్రాంతంల్లో గంగా పుష్కరాలు జరుగుతాయి. ముఖ్యంగా గంగోత్రి, దేవప్రయాగ, ఋషీకేశ్, హరిద్వార్, గర్హ్ ముక్తేశ్వర్, వారణాశి, ప్రయాగ రాజ్, గంగాసాగర్ ల్లో గంగా పుష్కరాలు జరిగినా.. ఎక్కువ మంది కాశీకి వెళ్ళడానికే ఆసక్తిని చూపిస్తారు. ఈ క్షేత్రంలో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు నివసిస్తారని భక్తుల నమ్మకం. వారణాశిని చేరుకోవడానికి దేశంలోని అన్నిప్రాంతాల నుండి విమాన, రైలు, బస్సు సౌకర్యాలున్నాయి.

కాశీ పుణ్యక్షేత్రంలో చేసే పాప, పుణ్యకార్యాలకు బహువిధ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. పుష్కర సమయంలో కాశీ (వారణాసి)లో మరణించిన వారికి పిండప్రధానంచేస్తే వారి ఆత్మలకు ముక్తి లభిస్తుందని నమ్మకం.

పుష్కరాల సమయంలో గంగానది పరివాహక ప్రాంతంలోని తీర్ధాల్లో తమ కుటుంబంలో మరణించిన పెద్దలకు పిండప్రధానం చేస్తే మరణించిన వారి ఆత్మలకు ముక్తి లభిస్తుంది. పుష్కర సమయంలో కాశీ యాత్రచేసే భక్తులు పుష్కర స్నానంతో పాటు.. ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించవచ్చు.

విశ్వేశ్వర జ్యోతిర్లింగం, దుండి వినాయకుడి, అన్నపూర్ణాదేవి , విశాలాక్షి, కాలభైరవుడు, వ్యాస కాశీని దర్శించుకోకుండా కాశీయాత్ర పూర్తికాదని పురాణాల కథనం.

కాశీలో గంగానది తీరం వెంట 64ఘాట్ లున్నాయి. వీటిల్లో ప్రధానంగా హారిశ్చంద్ర ఘాట్, కేధారేశ్వర ఘాట్, ప్రయాగఘాట్, మీర్ ఘాట్, సోమేశ్వరఘాట్, నేపాలీఘాట్, విశ్వేశ్వర్ ఘాట్, పంచ గంగా ఘాట్,, తులసిఘాట్, హనుమాన్ ఘాట్, అస్సీ ఘాట్, మానససరోవర్ ఘాట్, నారదఘాట్, చౌతాస్సీఘాట్, రాణామహల్ ఘాట్, అహల్యాభాయ్ ఘాట్ లున్నాయి. వీటిల్లో భక్తులు స్నానం చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే ఈ 64 ఘాట్ లను సందర్శకులు నదిలో నావపై ప్రయాణిస్తూ దర్శించవచ్చు.





























