Jagannath Temple: పూరి జగన్నాథ ఆలయం హుండీలో రూ. 28 లక్షల నగదు.. కరోనా తర్వాత ఇదే భారీ విరాళం..

|

Nov 13, 2021 | 7:22 PM

Jagannath Temple: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథ దేవాలయంలో రహస్య విరాళాలుగా రూ. 28 లక్షల నగదు లభించింది. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో..

Jagannath Temple: పూరి జగన్నాథ ఆలయం హుండీలో రూ. 28 లక్షల నగదు.. కరోనా తర్వాత ఇదే భారీ విరాళం..
Jagannath Temple
Follow us on

Jagannath Temple: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథ దేవాలయంలో రహస్య విరాళాలుగా రూ. 28 లక్షల నగదు లభించింది. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో రహస్య కానుకల కోసం  ఓ హుండీ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఈ రహస్య ‘హుండీ’ నుంచి భారీ మొత్తంలో  సొమ్ము లభించిందని శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (SJTA) అధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ  వారం హుండీని లెక్కించగా.. మొత్తం రూ.28,10,691 నగదు,  550 మి.గ్రా బంగారం, 61.70 గ్రాముల వెండి లభించినట్లు ఎస్‌జేటీఏ అధికారి తెలిపారు. 1975 లో ఏర్పడిన చట్టం ప్రకారం.. పూరీలో రహస్య విరాళాలను స్వీకరించడానికి ఆలయం లోపల ఈ ‘హుండీ’ని ఏర్పాటు చేశారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత లాక్ డౌన్ విధించిన తర్వాత అంటే దాదాపు రెండేళ్లో పూరి జగన్నాథ ఆలయం అందుకున్న అత్యధిక విరాళం ఇదే అని ఎస్‌జేటీఏ అధికారి  చెప్పారు.

వాస్తవానికి ఒడిశాలో శుక్రవారం నాడు ఉసిరి నవమి. ఈరోజు విష్ణువుని ప్రధాన దేవతగా పూజిస్తారు. భారీ సంఖ్యలో పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నారు. భక్తులు తమ కానుకలను గుప్తంగా హుండిలో సమర్పిస్తారు.  దీంతో ఈరోజు హుండీలో ఆదాయం అధికంగా ఉంటుంది. సాధారణంగా పూరీ జగన్నాథుడి ఆలయంలోని హుండీలో రోజుకు 2.5 నుంచి 3 లక్షల రూపాయల వరకు విరాళం వస్తుంది.

పూరీ జగన్నాథ దేవాలయంలో శ్రీకృష్ణుడుని ప్రధాన దేవుడిగా హిందువులు పూజిస్తారు. జగన్నాథుడు అంటే ప్రపంచానికి ప్రభువు అని అర్థం. ఈ నగరాన్ని జగన్నాథపురి లేదా పూరి అంటారు. అంతేకాదు ఈ ఆలయం హిందువుల చార్ ధామ్‌లో ఒకటిగా పురాణాలలో కథనం. ఇది వైష్ణవ క్షేత్రం. విష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడికొలువైన ఆలయం. ఈ ఆలయంలో వార్షిక రథయాత్ర ఉత్సవం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. రధోత్సవంలో ఆలయంలోని మూడు ప్రధాన దేవతలైన  జగన్నాథుడు, బలభద్రుడు తమ సోదరి సుభద్ర తో కలిసి నగరంలో ఊరేగుతారు

Also Read: గర్భిణీ స్త్రీలు మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ యోగాసనాన్ని ట్రై చేస్తే సరి..