పూరీ జగన్నాథ ఆలయంలోని ‘మహాప్రసాదాన్ని’ భక్తులకు ఉచితంగా పంపిణీ చేయాలని ఒడిశా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రి ఒకరు వెల్లడించారు. పవిత్ర ఒడియా కార్తీక మాసం తరువాత ఈ కార్యక్రమం అమలులోకి వచ్చే అవకాశం ఉందని ఒడిశా న్యాయ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ఆదివారం తెలిపారు. ఈ మహాప్రసాదం ఉచితంగా పంపిణీ చేయడం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.14 నుంచి 15 కోట్ల అదనపు భారం పడనుందని చెప్పారు. ఆర్థికంగా ఉన్న కొంతమంది భక్తులను ఈ పథకంలో చేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
జగన్నాథుని ఆలయంలో దర్శనం అనంతరం భక్తులు ఇంటికి తిరిగి వెళ్లేప్పుడు వారి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు మహాప్రసాదం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్టుగా వివరించారు.
ప్రభుత్వంపై భారాన్ని తగ్గించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడానికి ముందుకు రావాలని హరిచందన్ ప్రజలను కోరారు. ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు జగన్నాథుని ఆశ్వీదాను గ్రహం కలిగిస్తుందని సూచించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..