
న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ బట్టి వ్యక్తిత్వ లక్షణాలను కలిగి ఉంటారని.. 1 నుంచి 9 వరకూ ఉన్న సంఖ్యలకు నవ గ్రహాలు అధిదేవతలని నమ్ముతారు. మూల సంఖ్య 3ని విస్తరణ, జ్ఞానం, అదృష్టంతో ముడిపడి ఉన్న బృహస్పతి గ్రహంచే పాలించబడుతుంది. ఈ నేపధ్యంలో ఏ నెలలోనైనా 3, 12, 21, లేదా 30 తేదీలలో జన్మించిన వ్యక్తుల మూల సంఖ్య 3 అవుతుంది. ఈ నేపధ్యంలో ఈ తేదీల్లో జన్మించినవారు అదృష్టవంతులుగా భావిస్తారు.
3వ తేదీలో జన్మించినవారు: న్యూమరాలజీ ప్రకారం 3 వ తేదీన పుట్టిన వ్యక్తులు చాలా ప్రశాంతంగా, సౌమ్యంగా ఉంటారు. ఈ తేదీలో పుట్టిన వారంటే తండ్రికి చాలా ఇష్టం. పుడుతూనే తండ్రికి అదృష్టాన్ని కలిగిస్తారు. ఎప్పుడూ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా ఈ తేదీలో పుట్టిన ఆడపిల్ల ఇటు పుట్టింటికి, అటు అత్తారింటికి లక్ష్మీదేవి.. ఈ స్త్రీ అడుగు పెట్టిన చోట అదృష్టం ఉంటుంది. ధనానికి లోటు ఉండదు. సుఖ సంతోషాలతో జీవిస్తారు.
12వ తేదీలో జన్మించినవారు: ఈ తేదీన పుట్టిన వారు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన వ్యక్తులు. తల్లిదండ్రులకు అదృష్టాన్ని తీసుకొస్తారు. ఈ తేదీలో జన్మించిన వారు వ్యాపార రంగంలో అడుగు పెడితే లభిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఎప్పుడూ వీరికి డబ్బు ఇబ్బంది కలుగదు. ఒకవేళ చేతిలో ఉన్న ఈ డబ్బులే చివరివి అని అనుకుంటే.. వెంటనే ఆ సమస్య తీరిపోతుంది. ఈ తేదీన పుట్టిన ఆడపిల్లలు ఇంట్లో డబ్బుకు అన్నానికి లోటు అన్న మాట వినిపించదు.
21తేదీలో జన్మించినవారు: ఈ తేదీలో పుట్టిన వారు కూడా చాలా అదృష్టవంతులు. తల్లిదండ్రులకు మంచి పేరుని తెస్తారు. చాలా తెలివైన వారు. ఏదైనా పని మొదలు పెట్టాలంటే.. ప్రణాళికలను వేసుకుంటారు. తమ కలలను నిజం చేసుకునేందుకు ఎంత కష్టాన్ని అయినా ఇష్టంగా పడతారు. ఈ తేదీన పుట్టిన ఆడపిల్ల అత్తారింటికి లక్ష్మీదేవి. అడుగు పెట్టిన వెంటనే సిరి సంపదలు లభిస్తాయి.
30తేదీలో జన్మించినవారు: ఏ నెలలోనైనా 30వ తేదీన పుట్టిన వ్యక్తులు ఆ ఇంటికి సుఖ శాంతులను తీసుకొస్తారు. వీరు శ్రమ జీవులు. ఎటువంటి సమస్య వచ్చినా నిరాస పడకుండా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ తేదీన పుట్టినవారు చాలా అందంగా ఉంటారు. శాంతంగా ఉంటారు. ఈ తేదీన జన్మించిన వారిని పెళ్లి చేసుకున్న భాగస్వామికి అదృష్టం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.
మూల సంఖ్య 3 కోసం ఇతర చిట్కాలు:
రంగులు: పసుపు, నారింజ, గులాబీ రంగులను అదృష్ట రంగులుగా పరిగణిస్తారు.
కెరీర్ మార్గాలు: తగిన కెరీర్.. రాయడం, మాట్లాడటం, కౌన్సెలింగ్ లేదా సృజనాత్మకత, వ్యాపార రంగం బెస్ట్ ఎంపిక.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.