Dussehra: నవరాత్రుల సమయంలో ఏం చేయాలో.. చేయకూడదో తెలుసా.. ఈ సమాచారం మీ కోసం..

|

Sep 22, 2022 | 1:56 PM

దసరా మహోత్సవాలు మరో ఐదు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా నవరాత్రుల తొమ్మది రోజులు చాలా మంది ఉపవాసాలు చేస్తుంటారు. అమ్మవారికి చాలా ఇష్టమైన పండుగ కావడంతో నవరాత్రుల 9 రోజులు..

Dussehra: నవరాత్రుల సమయంలో ఏం చేయాలో.. చేయకూడదో తెలుసా.. ఈ సమాచారం మీ కోసం..
Dasara Sarannavaratrulu
Follow us on

Dussehra: దసరా మహోత్సవాలు మరో ఐదు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా నవరాత్రుల తొమ్మది రోజులు చాలా మంది ఉపవాసాలు చేస్తుంటారు. అమ్మవారికి చాలా ఇష్టమైన పండుగ కావడంతో నవరాత్రుల 9 రోజులు ఎంతో నిష్టతో ఉంటారు అమ్మవారి భక్తులు. అలాగే తొమ్మిది రోజులు వేడుకలను అమ్మవారి భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. చాలా మంది భక్తులు నిష్టగా ఉపవాసం చేయాలనుకుంటారు. ఈసమయంలో తెలియకుండానే కొన్ని చేయకూడని పనులు చేస్తుంటారు. తరువాత తాము చేసిన తప్పులు తెలుసుకుని బాధపడుతూ ఉంటారు. అసలు నవరాత్రుల సమయంలో ఎలాంటి పనులు చేయాలి. ఎలాంటివి చేయకూడదో తెలుసుకుందాం. దుర్గాదేవిని పూజించేవారికి ఎంతో పవిత్రమైన హిందూ పండుగే నవరాత్రి. ఈ సంవత్సరం శరద్ నవరాత్రులు సెప్టెంబర్ 26నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అక్టోబర్ 5వ తేదీన విజయ దశమి, దుర్గా విసర్జనతో ఈ పండుగ ముగుస్తుంది. హిందూ మాసం అశ్విన్‌లోని శారదీయ నవరాత్రులు అన్ని నవరాత్రులలో అత్యంత ముఖ్యమైనవి. అయితే ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ఎంత నిష్టగా ఉంటే.. అమ్మవారి చల్లని దీవెన భక్తులపై అంత ఎక్కువుగా ఉంటుందని భక్తుల విశ్వాసం.

నవరాత్రి అనేది ఆధ్యాత్మిక అవగాహన. స్వీయ-సాక్షాత్కారం, స్వీయ-క్రమశిక్షణ, స్వీయ-నియంత్రణ కచ్చితంగా అవసరం. అందువల్ల తపస్సు చేయడం చాలా కీలకం. నవరాత్రుల తొమ్మిది రోజులు క్రమశిక్షణతో ఉంటూ తపస్సు చేయాలి.

నవరాత్రి వేడుకల సందర్భంగా దుర్గాదేవిని తొమ్మిది రూపాలలో పూజిస్తాము. అందుకే ఈ పండుగ సమయంలో చుట్టూ ఉన్న స్త్రీలను గౌరవించేలా ప్రవర్తన ఉండాలి.

ఇవి కూడా చదవండి

అమ్మవారికి అఖండ జ్యోతిని వెలిగిస్తే.. దానిని నైరుతి దిశలో ఉంచాలి. అఖండ జ్యోతిని నిర్వహించలేకపోతే.. రాత్రంతా ఉండేలా ఒక దీపాన్ని ఏర్పాటు చేసుకుని వెగిలించడం మంచిది.

నవరాత్రుల సమయంలో ఉపవాసం ఉండేవారు సాధారణంగా శుద్ధి చేసిన ఉప్పు కాకుండా రాక్ సాల్ట్ వాడాలి.
ఉపవాసం సమయంలో మద్యం, పొగాకుకు దూరంగా ఉండాలి.

ఈ తొమ్మిది రోజులు కచ్చితంగా వెల్లుల్లి, ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..