Navaratri 2022: నవరాత్రుల్లో దుర్గా సప్తశతి పారాయణం చేయడం వలన కలిగే ఫలితాలు ఏమిటో తెలుసా..

|

Sep 29, 2022 | 10:35 AM

దుర్గా సప్తశతి మార్కండేయ పురాణంలో ఒక భాగం. ఇందులో 700 శ్లోకాలు ఉన్నందున దీనిని 'దుర్గా సప్తశతి' అని కూడా పిలుస్తారు. ఇది అమ్మవారి మహిమపై మార్కండేయుడు,  బ్రహ్మ మధ్య జరిగిన చర్చ అని చెబుతారు.

Navaratri 2022: నవరాత్రుల్లో దుర్గా సప్తశతి పారాయణం చేయడం వలన కలిగే ఫలితాలు ఏమిటో తెలుసా..
Durga Saptashati
Follow us on

Navaratri 2022: నవరాత్రులలో..  దుర్గాదేవిని వివిధ మార్గాల్లో పూజిస్తూ.. భక్తులు ప్రసన్నం చేసుకోవాలనుకుంటారు. చాలా మంది నవరాత్రుల్లో  పారాయణం చేస్తారు. దుర్గా సప్తశతి పారాయణం చేయడం వల్ల ఫలం లభిస్తుందని.. ఆగిపోయిన పనులు కూడా పూర్తి అవుతాయని నమ్మకం. దుర్గా సప్తశతి గ్రంథంలో అనేక అధ్యాయాలు ఉన్నాయి. నవరాత్రులలో దీనిని పారాయణం చేయడం వల్ల ఆహారం, సంపద, కీర్తి ప్రతిష్టలు మొదలైనవి లభిస్తాయి. దుర్గా సప్తశతి వచనం 13 అధ్యాయాలను కలిగి ఉంది. ఇందులో దుర్గాదేవి రాక్షసులను చంపడం గురించి చెప్పబడింది. ఈరోజు దుర్గా సప్తశతి  అంటే ఏమిటి..? ఇది చదవడం వలన కలిగే శుభఫలితాలు ఏమిటో తెలుసుకుందాం..

దుర్గా సప్తశతి అంటే ఏమిటి?
దుర్గా సప్తశతి మార్కండేయ పురాణంలో ఒక భాగం. ఇందులో 700 శ్లోకాలు ఉన్నందున దీనిని ‘దుర్గా సప్తశతి’ అని కూడా పిలుస్తారు. ఇది అమ్మవారి మహిమపై మార్కండేయుడు,  బ్రహ్మ మధ్య జరిగిన చర్చ అని చెబుతారు. మార్కండేయ పురాణంలోని ఈ భాగాన్ని తొలగించి దుర్గా సప్తశతి ప్రత్యేక గ్రంథంగా రూపొందించబడింది. వేద వ్యాసుని రచించిన మార్కండేయ పురాణం నుండి తీసుకోబడింది. కనుక చాలా మంది వేద వ్యాసుడి దుర్గా సప్తశతి రచయితగా భావిస్తారు. దుర్గా సప్తశతి 3 భాగాలలో మహాకాళి, మహాలక్ష్మి , మహా సరస్వతి అనే 3 పాత్రలు ఉన్నాయి. దేవీమాహాత్మ్యం గురించి తెలియజేస్తుంది. అంటే అమ్మవారి గొప్పతనాన్ని వివరిస్తుంది. మహిషాసుర అనే రాక్షసుడిపై దుర్గాదేవి సాధించిన విజయం గురించి ఈ దుర్గా సప్తశతిలో పేర్కొన్నారు. ఇది వివిధ రాక్షసులను చంపడాన్ని వివిధ అధ్యాయాల్లో రచించారు. ఏ అధ్యాయంలో ఏ విధంగా అమ్మవారు మహిషాసురిడిని..అతడి సైన్యాన్ని అమ్మవారు శిక్షించిందో  తెలుసుకుందాం..

మొదటి అధ్యాయం – మధు కైటభుల వధ
అధ్యాయం రెండు  – మహిషాసురుని సైన్యాన్ని చంపడం
అధ్యాయం మూడు  – మహిషాసుర వధ
నాల్గవ అధ్యాయం: ఇంద్రుడు దేవత స్తోత్రం
ఐదవ అధ్యాయం – అంబిక రూప స్తోత్రం.. ప్రశంసలు
అధ్యాయం ఆరు  – ధూమ్రలోచనుని వధ
ఏడవ అధ్యాయం-  చండ ముండౌల వధ
ఎనిమిదవ అధ్యాయం – రక్తబీజ వధ
అధ్యాయం తొమ్మిది : నిశుంభని వధ
పదవ అధ్యాయం  :  శుంభని వధ
పదకొండవ అధ్యాయం – దేవతలచే దేవి స్తుతి
పన్నెండవ అధ్యాయం – దేవి చరిత్ర మహత్యం
పదమూడవ అధ్యాయం – సురథ, వైశ్యులకు అమ్మవారి వరం

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)