PM Modi Durga Puja: సిఆర్ పార్క్‌ను సందర్శించిన ప్రధాని.. దుర్గాష్టమి పూజ వేడుకల్లో పాల్గొన్న మోడీ

దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రులను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. దేశ రాజధాని డిల్లీ సహా అనేక ప్రాంతాల్లో మండపాలను ఏర్పాటు చేసి దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. నవరాత్రిలో దుర్గాష్టమి రోజున ప్రధాని మోడీ దుర్గా మండపాన్ని సందర్శించారు. దక్షిణ ఢిల్లీలోని సిఆర్ పార్క్‌లో ఏర్పాటు చేసిన మండపంలో దుర్గమ్మకి ప్రత్యేక పూజలను నిర్వహించారు.

PM Modi Durga Puja: సిఆర్ పార్క్‌ను సందర్శించిన ప్రధాని.. దుర్గాష్టమి పూజ వేడుకల్లో పాల్గొన్న మోడీ
Pm Modi Durga Puja

Updated on: Oct 01, 2025 | 9:21 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సెప్టెంబర్ 30న, దుర్గా అష్టమి సందర్భంగా దక్షిణ ఢిల్లీలోని సిఆర్ పార్క్ వద్ద ఉన్న దుర్గా పూజ మండపాన్ని సందర్శించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రధాని మోడీ దుర్గాదేవికి ప్రార్థనలు చేశారు. ఆ ప్రాంతంలోని ఐకానిక్ కాళీమాత ఆలయంలో అమ్మవారికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన సాంప్రదాయ బెంగాలీ సంస్కృతికి అనుగుణంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రధాని మోడీ పర్యటనకు ముందు దక్షిణ ఢిల్లీలోని ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అనేక మార్గాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించారు.

ఇవి కూడా చదవండి

సిఆర్ పార్క్, బెంగాలీ కమ్యూనిటీ ప్రాంతంలో ప్రధాని మోడీ పర్యటన

 

సిఆర్ పార్క్, బెంగాలీ కమ్యూనిటీ ప్రాంతం

చిత్తరంజన్ పార్క్, లేదా CR పార్క్, బెంగాలీ కమ్యూనిటీ ప్రాంతం.. ఇక్కడ దాదాపు ప్రతి పార్కులో శరన్నవరాత్రుల సందర్భంగా ఒక దుర్గమ్మ మండపం ఉంటుంది. ప్రధాని మోడీ పూజలు చేసిన అమ్మవారి మండపం దక్షిణ ఢిల్లీలోని ఒక ఉన్నత స్థాయి ప్రాంతమైన గ్రేటర్ కైలాష్ పార్ట్-2 పక్కన ఉంది.

ప్రతి ఒక్కరి ఆనందం, శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి ప్రార్థన

సిఆర్ పార్క్ సందర్శించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రధాని మోడీ ట్విట్టర్‌లో నవరాత్రిలోని మహా అష్టమి శుభ సందర్భంగా.. దుర్గా పూజ వేడుకల్లో పాల్గొనడానికి ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్‌ను సందర్శించానని పేర్కొన్నారు. చిత్తరంజన్ పార్క్ బెంగాలీ సంస్కృతితో బలమైన అనుబంధానికి ప్రసిద్ధి చెందింది. ఈ వేడుక నిజంగా మన సమాజంలో ఐక్యత, సాంస్కృతిక చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. అందరి ఆనందం, శ్రేయస్సు కోసం ప్రార్థించానని చెప్పారు.

వేడుకకు బయలుదేరే ముందు ప్రధానమంత్రి మోదీ అందరికీ మహా అష్టమి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి తాను ప్రార్థన చేసిన విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు.

రేఖ గుప్తా కూడా హాజరు

ఈ పర్యటనలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ కైలాష్-II వెల్ఫేర్ అసోసియేషన్ నివాసితులకు ఒక సలహా ఇచ్చినిడ్. CR పార్క్లోని కొన్ని అంతర్గత రోడ్లను నిర్వహించాలని.. ట్రాఫిక్ సజావుగా సాగడానికి, భద్రత కోసం ఈ ఆంక్షలు మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అమలులో ఉన్నాయి.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..