Dussehra 2021: దేశ విదేశీయులను ఆకర్షించే మైసూర్ దసరా ఉత్సవాలకు 411 ఏళ్ల ఘన చరిత్ర..

|

Oct 08, 2021 | 6:10 PM

Mysuru Dussehra 2021: కరోనా నిబంధనను పాటిస్తూ.. రెండో ఏడాది కూడా మైసూర్ ప్యాలెస్ లో దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 10 రోజుల పాటు జరిగే ..

Dussehra 2021: దేశ విదేశీయులను ఆకర్షించే మైసూర్ దసరా ఉత్సవాలకు 411 ఏళ్ల ఘన చరిత్ర..
Mysure Dasara
Follow us on

Mysuru Dussehra 2021: కరోనా నిబంధనను పాటిస్తూ.. రెండో ఏడాది కూడా మైసూర్ ప్యాలెస్ లో దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 10 రోజుల పాటు జరిగే  దసరా ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను కర్ణాటక రాష్ట్రం ‘నాద హబ్బ’ (రాష్ట్ర పండుగ) గా జరుపుకుంటారు. ఇక ఉత్సవాల్లో భాగంగా మైసూర్సూ రాజకుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్.. సాంప్రదాయ దుస్తులను ధరించి ఖాసగి దర్బార్  ను నిర్వహించారు. బంగారు సింహాసనాన్ని అధిరోహించి.. వేద స్తోత్రాలు పఠించారు.  మైసూర్ లో దసర ఉత్సవాలు 2020 నాటికి ఈ ఉత్సవాలు మొదలుపెట్టి 410 ఏళ్ళు పూర్తి చేసుకుని ఈ ఏడాది 411 వ సంవత్సరంలోకి అడుగు పెట్టాయి.

మైసూరు దసరా ఉత్సవాలకు వందల ఏళ్ళ చరిత్ర ఉంది. పదిరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు, పూజలు  ఊరేగింపులు దేశ విదేశీయులను సైతం ఆకట్టుకుంటాయి. ఈ ఉత్సవాలు చూసేందుకు ప్రతీ ఏటా లక్షలాది మంది పర్యాటకులు మైసూర్ వస్తున్నారు.  ఇక ఉత్సవాల్లో భాగంగా మైసూర్ ప్యాలెట్ దీప కాంతుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఇక్కడ దసరా ఉత్సవాలను 15వ శతాబ్దంలో విజయనగర రాజులు ప్రారంభించినట్లు చారిత్రక అధరాలు లభ్యమయ్యాయి. పర్షియాకు చెందిన రాయబారి అబ్దుర్ రజాక్ మైసూర్ లోని దసరా ఉత్సవాలు గురించి రాసుకున్నారు. విజయనగర సామ్రాజ్య పతనం అనంతరం మైసూరు రాజులైన ఉడయార్లు శ్రీరంగపట్నలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు.  దసరా ఉత్సవాల సమయంలో మైసూరు ప్యాలెస్, చాముండీ కొండ దీప కాంతుల్లో వెలిగిపోతుంది. ఈ సమయంలో మైసూర్ ను సందర్శించడానికి పర్యాటకులు అమితాశక్తిని చూపిస్తారు.

1805లో కృష్ణరాజ ఉడయార్ III దసరా ఉత్సవాలల్లో మైసూరు ప్యాలస్ లో ప్రత్యేక రాజదర్బారు నిర్వహించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అది ఆచారంగా మారిపోయింది.. నేటికీ ప్రయివేట్ దర్భార్ ను వారసులు కొనసాగిస్తూనే ఉన్నారు. నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన మహర్నవమి నాడు రాచఖడ్గాన్ని , ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకువచ్చి పూజలను నిర్వహిస్తారు. మహర్నవమి రోజున జరిగే ఉత్సవాలను చూడడానికి  భారీ సంఖ్యలో భక్తులు మైసూర్ ప్యాలెట్ కు , చాముండేశ్వరి ఆలయానికి చేరుకుంటారు.

Also Read:  దుర్గాదేవిని ఆవాహన చేస్తూ.. పూజారి ఛాతీపై 21 కలశాల స్థాపన.. ఎక్కడంటే..