Naraka chaturdashi 2024: నేడు నరక చతుర్దశి.. పూజా శుభ సమయం నుంచి ప్రాముఖ్యత వరకు పూర్తి వివరాలు తెలుసుకోండి

|

Oct 30, 2024 | 7:25 AM

హిందూ మతంలో నరకాసురుడిని సంహరించిన రోజు నరక చతుర్ధశిగా జరుపుకుంటారు. దీనిని చోటి దీపావళి అని కూడా అంటారు. ఈ పండగ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున యముడిని పూజించే సంప్రదాయం ఉంది. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులు అకాల మరణం నుండి రక్షించబడతారని, ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ఈ సంవత్సరం ఛోటీ దీపావళిని పూజించడానికి శుభ సమయం ఎప్పుడు? సాయంత్రం యమ దీపం ఎలా వెలగించాలో తెలుసుకుందాం..

Naraka chaturdashi 2024: నేడు నరక చతుర్దశి.. పూజా శుభ సమయం నుంచి ప్రాముఖ్యత వరకు పూర్తి వివరాలు తెలుసుకోండి
Naraka Chaturdashi 2024
Follow us on

చోటి దీపావళి పండుగను ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఛోటీ దీపావళిని నరక చతుర్దశి అని కూడా అంటారు. ఈ పండుగను దీపావళి ఐదు రోజుల పండగలో రెండవ రోజు అంటే దీపావళి ముందు రోజు జరుపుకుంటారు. ఛోటీ దీపావళికి కూడా తనదైన ప్రత్యేకత ఉంది. ఈ రోజున మృత్యుదేవతగా పరిగణించబడే యమ ధర్మ రాజుని పూజిస్తారు.

ఛోటీ దీపావళి లేదా నరక చతుర్దశి రోజున ఇలా చేయడం వల్ల కుటుంబంలోని వ్యక్తుల అకాల మరణం నివారిస్తుందని నమ్ముతారు. ఈ రోజున యముడిని పూజించడం వల్ల అకాల మృత్యుభయం, నరక భయం నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు సాయంత్రం యమ దీపం అని పిలువబడే దీపాన్ని వెలిగించి దక్షిణ దిశలో పెడతారు. ఈ సంవత్సరం ఛోటీ దీపావళి పండుగను ఈరోజు అంటే అక్టోబర్ 30న జరుపుకుంటారు.

చోటి దీపావళి 2024 పూజకు శుభ సమయం

ఇవి కూడా చదవండి

పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి 30 అక్టోబర్ 2024న మధ్యాహ్నం 1:04 గంటలకు ప్రారంభమై.. మరుసటి రోజు అక్టోబర్ 31న మధ్యాహ్నం 3:11 గంటలకు ముగుస్తుంది. ఛోటీ దీపావళి రోజున అక్టోబరు 30న సాయంత్రం 4:36 నుండి 6:15 గంటల వరకు పూజకు అనుకూలమైన సమయం.

ఛోటీ దీపావళిని నరక చతుర్దశి అని ఎందుకు అంటారు?

ఛోటీ దీపావళిని నరక చతుర్దశిగా పిలవడానికి సంబంధించి కొన్ని పురాణ కథలు ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రసిద్ధమైన కథ శ్రీకృష్ణునికి సంబంధించినది. పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడని నమ్మకం. నరకాసురుడు దురాగతాలతో మూడు లోకాలూ దుఃఖించాయి. అతను రాజుల కుమార్తెలను మరియు స్త్రీలను అపహరించేవాడు. దేవతలను బందీగా చేసుకున్నాడు. నరకాసురుడు అసుర కృత్యాలు ఎక్కువ కావడంతో ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున శ్రీ కృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుడిని సంహరించి దేవతలను సుమారు 16 వేల మంది స్త్రీలను అతని చెర నుండి విడిపించాడు. నరకాసుర వధ… అతని చెర నుండి వేలాది మందికి విముక్తి లభించినందుకు ప్రజలు దీపాలు వెలిగించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అప్పటి నుండి ఛోటీ దీపావళి పండుగను జరుపుకుంటారు. నరకాసురుడిని వధించినందున ఛోటీ దీపావళిని నరక చతుర్దశి అని పిలుస్తారు.

చోటీ దీపావళి పూజ విధి

ఛోటీ దీపావళి రోజు తెల్లవారుజామున నువ్వుల నూనె రాసుకుని స్నానం చేస్తే శ్రీకృష్ణుని కృప వల్ల అందం, ఆరోగ్యం లభిస్తాయని విశ్వాసం. ఈ రోజున శ్రీకృష్ణుడు, యమ ధర్మరాజుతో పాటు హనుమంతుడిని కూడా పూజిస్తారు. ఈ రోజున హనుమంతుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున స్నానానంతరం ఆచారాల ప్రకారం ధూపం, దీపాలు వెలిగించి హనుమంతుడిని పూజించాలి.

ఈ రోజున హనుమాన్ చాలీసా చదివి హారతిని ఇస్తారు. ఆ తర్వాత వివిధ రకాల ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. సాయంత్రం ఇంట్లో దీపం వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద యమ దీపం పేరుతో నాలుగు ముఖాల పిండి దీపాన్ని వెలిగిస్తారు. దీనిని యమ దీపం అని అంటారు. ఈ దీపాన్ని ప్రధాన ద్వారం వద్ద దక్షిణాభిముఖంగా వెలిగించాలి.

ఛోటీ దీపావళి ప్రాముఖ్యత

నరక చతుర్దశి అని కూడా పిలువబడే ఛోటీ దీపావళి హిందూ మతంలో ఒక ముఖ్యమైన పండుగ. ఈ రోజున ప్రజలు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. విశ్వాసాల ప్రకారం ఈ రోజున శ్రీ కృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. అతని దురాగతాల నుండి మూడు లోకాలను విడిపించాడు. ఛోటీ దీపావళికి అనేక ఇతర కారణాల వల్ల ప్రాముఖ్యత ఉంది. ఇది అందం, వయస్సు, బలాన్ని పొందే రోజుగా కూడా పరిగణించబడుతుంది. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లు, దుకాణాలు, వ్యాపారాలు మొదలైనవాటిని శుభ్రం చేసి పూలతో, దీపాలతో అలంకరిస్తారు. దీపం వెలిగించడం ద్వారా చీకటి రూపంలో ఉన్న చెడు తొలగిపోయి అందరికీ ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షిస్తారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)