Mandara Parvatham: అమృతం కోసం సముద్రాన్ని చిలికిన కవ్వం మంధర పర్వతం.. హాలాహలం పాత్ర ఎక్కడుందంటే..

|

Jun 12, 2024 | 3:28 PM

బీహార్‌లో అనేక మతపరమైన, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి భాగల్పూర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో బంకా జిల్లాలో ఉన్న మంధర పర్వతం. దీనిని మందరాచల పర్వతం అని కూడా పిలుస్తారు. మంధర శిఖరం 800 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ పర్వతానికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి. ఈ పర్వతం హిందూ మతానికి సంబంధించినది మాత్రమే కాదు.. మూడు మతాలకు కూడా పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది.

Mandara Parvatham: అమృతం కోసం సముద్రాన్ని చిలికిన కవ్వం మంధర పర్వతం.. హాలాహలం పాత్ర ఎక్కడుందంటే..
Mandara Parvatham
Follow us on

హిందూ పురాణ మత గ్రంథాలు, పురాణాలలో పేర్కొన్న కథలకు సంఘటనలకు సజీవ సాక్ష్యంగా ఇప్పటికీ భూమిపై కనిపిస్తూనే ఉన్నాయి. అందులో ఒకటి మంధర పర్వతం. ఈ పర్వతాన్ని దేవతలు, రాక్షసులు సముద్రాన్ని మథనం చేయడానికి కవ్వంగా ఉపయోగించారు. ఈ పర్వతం ఇప్పటికీ భారతదేశంలో ఉందని చెబుతారు.

మంధర పర్వతం ఎక్కడ ఉందంటే..

బీహార్‌లో అనేక మతపరమైన, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి భాగల్పూర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో బంకా జిల్లాలో ఉన్న మంధర పర్వతం. దీనిని మందరాచల పర్వతం అని కూడా పిలుస్తారు. మంధర శిఖరం 800 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ పర్వతానికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి. ఈ పర్వతం హిందూ మతానికి సంబంధించినది మాత్రమే కాదు.. మూడు మతాలకు కూడా పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది.

సముద్ర మథనం

అమృతం కోసం సముద్ర మథనం చేసిన కథ హిందూ మత గ్రంథాలలో వివరించబడింది. పురాణాల ప్రకారం మహర్షి దుర్వాసుని శాపం కారణంగా దేవతల నివాసం స్వర్గం.. సంపద, కీర్తి, ఐశ్వర్యం లేకుండా పోయింది. అప్పుడు దేవతలకు విష్ణువు ఒక సలహా ఇచ్చాడు. రాక్షసులతో కలిసి దేవతలు సముద్ర మథనం చేయమని పరిష్కారం చెప్పాడు. సముద్ర మథనం చేసిన అమృతాన్ని పొందమని.. ఆ అమృతాన్ని దేవతలు తాగమని అప్పుడు మీరు అమరులవుతారని శ్రీ మహా విష్ణువు చెప్పాడు.

ఇవి కూడా చదవండి

పర్వతం మీద వాసుకి జాడలు

పురాణాల ప్రకారం సముద్ర మథనానికి కవ్వంగా మంధర పర్వతం, వాసుకి అనే నాగుని తాడుగా చేసుకున్నారు. అలా వాసుకి మంధర పర్వతం చుట్టూ చుట్టుకుని కవ్వంగా మారినప్పుడు.. ఈ పర్వతం మీద వాసుకి జాడలు పడ్డాయి.ఈ పర్వతంపై ఇప్పటికీ ఈ జాడలు కనిపిస్తాయి. వాసుకి పాము రాపిడి వల్ల ఏర్పడిన మంధర పర్వతం చుట్టూ దట్టమైన గీత ఉంది. పూర్వం ఇక్కడ వందలాది చెరువులు ఉండేవని చెబుతారు. వాటిలో కొన్ని చెరువులు నేటికీ ఉన్నాయి. పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని బలిసానగర్ అని పిలిచేవారు. ఇప్పుడు ఈ ప్రదేశాన్ని బౌన్సి అని పిలుస్తారు.

శివుడు విషం తాగిన పాత్ర

సముద్ర మథనం సమయంలో మొదటగా హాలాహలం ఉద్భవించగా మొత్తం 14 అద్భుత విషయాలు ఉద్భవించాయి. ఈ విషయం ప్రపంచాన్ని దహిస్తున్న సమయంలో సమస్త ప్రపంచాన్ని రక్షించడానికి.. శివుడు ఆ హాలాహలం తాగి తన కంఠంలో దాచుకున్నాడు. అయితే సముద్ర మథన సమయంలో విషం లభ్యమైన పాత్ర నేటికీ పర్వతంపై ఉంది. ఈ ప్రదేశాన్ని శంఖ కుండం అని పిలుస్తారు.

పర్వతం కింద సరస్సు

శ్రీ మహా విష్ణువు మధు కైటబ్‌ అనే రాక్షసులను సంహరించి మందారాన్ని ఆర్యులకు అప్పగించాడు. తరువాత ఈ ప్రదేశం భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మధుసూదన్ ధామ్‌గా మారింది. మంధర పర్వతం దాదాపు 800 అడుగులు. పర్వతం క్రింద.. తూర్పు వైపున పాపహారిణి అనే సరస్సు ఉంది. ఈ సరస్సును 7వ శతాబ్దానికి చెందిన దివంగత గుప్తా పాలకుడు రాజా ఆదిత్య సేన్ భార్య రాణి కోన్ దేవి తన భర్త చర్మవ్యాధి తగ్గిన తర్వాత నిర్మించిందని చారిత్రాత్మక కథనం.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు