Mysuru Dasara 2024: అంగరంగ వైభవంగా మైసూర్‌ దసరా ఉత్సవాలు.. ఆకట్టుకుంటున్న జంబూ సవారీ

|

Oct 12, 2024 | 3:26 PM

మైసూరులో దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా సాగుతున్నాయి. శక్తి నామంతో మైసూరు నగరం పులకించి పోతోంది. జంబూ సవారీని చూసేందుకు కర్నాటక ప్రజలు భారీగా తరలివచ్చారు.

Mysuru Dasara 2024: అంగరంగ వైభవంగా మైసూర్‌ దసరా ఉత్సవాలు.. ఆకట్టుకుంటున్న జంబూ సవారీ
Mysore Dasara
Follow us on

మైసూరులో దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ నిలిచే జంబూ సవారీ కలర్‌ఫుల్‌గా జరుగుతోంది. జంబూ సవారీని తిలకించేందుకు మైసూరు ప్యాలెస్‌కు చేరుకున్నారు కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌. అటు.. జంబూ సవారీని చూసేందుకు కర్నాటక ప్రజలు భారీగా తరలివచ్చారు. దసరా ఉత్సవాల కోసం మైసూర్‌ ప్యాలెస్‌ను అందంగా అలంకరించారు. వర్షంలోనే ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శక్తి నామంతో మైసూరు నగరం పులకించి పోతోంది. . జగన్మాత సేవలో గజరాజులు తరించిపోతున్నాయి. మైసూర్‌ ఇక చాముండేశ్వరీ అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు.

గత ఏడాది రాష్ట్రంలో కరువు పరిస్థితి ఏర్పడ్డా.. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు బాగా కురవడంతో రైతాంగం కుదుటపడింది. అందుకే.. ఈ ఏడాది దసరా వేడుకల్ని మునుపటి కంటే ఘనంగా నిర్వహిస్తోంది కన్నడ సర్కార్. మైసూరు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబౌతుంది. దాదాపు సగం పోలీసు ఫోర్స్ మైసూర్ మహోత్సవ్ మీదే ఫోకస్ పెట్టింది. మైసూర్‌ దసరా ఉత్సవాలు తిలకించేందుకు దేశవిదేశాల నుంచి జనం తరలివచ్చారు. అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. కన్నడ సంస్కృతిని ప్రతిబింబిచేలా శకటాలను ప్రదర్శించారు. రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులు తరలివచ్చారు. 1610 నుంచి మైసూర్‌ దసరా ఉత్సవాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. వడయార్‌ పాలకులు ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి