
చిండి మాత ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని కర్సోగ్ కొండల మధ్య ఉన్న ఒక మర్మమైన ఆలయం. ఈ ఆలయంలో కొలువై భక్తులతో పూజలను అందుకుంటున్న చండి మాత ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. ఈ ఆలయం సిమ్లాకు వెళ్లే మార్గంలో కర్సోగ్ నుంచి 13 కి.మీ దూరంలో ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. భక్తులకు ఈ ఆలయం గురించి విపరీతమైన భక్తి విశ్వాసాలున్నాయి. ఎన్నో మిస్టరీలతో నిండి ఉన్న ఆలయం హిమాలయాల ఆకర్షణ కేంద్రంగా కూడా ఉంది.
చిండి మాత ఆలయాన్ని దాని రహస్య చరిత్రతో సహా అనేక విషయాలు ప్రత్యేకంగా చరిత్రలో నిలబెట్టాయి. చిండి మాత విగ్రహం అత్యంత పురాతనమైంది. అమ్మవారు ఎనిమిది చేతులతో దర్శనం ఇస్తారు. ఈ రాతి విగ్రహం, ఈ ఆలయంపై ప్రజల విశ్వాసం. పిల్లలు లేని దంపతులకు సంతానాన్ని వరంగా ఇస్తుందని అంటారు. ఈ ఆలయానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయ పటాన్ని చీమలు తయారు చేశాయి.
పురాణాల ప్రకారం చిండి మాత ఆలయ బ్లూప్రింట్ ఏ మానవ చేతితోనూ రూపొందించబడలేదు. శ్రమజీవులైన చీమల బృందంతో రూపొందించబడిందట. స్థానిక జానపద కథల ప్రకారం మాతా రాణి స్వయంగా ఒక కన్య రూపంలో కనిపించి.. చీమలు తయారు చేసిన పటాన్ని ఉపయోగించి ఆలయ నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించింది. ఆలయ రూపకల్పనకు సంబంధించిన వివరాలు పూజారికి కలలో కనిపించి అమ్మవారు సమాచారం అందించిందట. ఆలయం తదనుగుణంగా నిర్మించబడింది. ఇది మాత్రమే కాదు ఆ తరువాత ఆలయానికి ఆనుకుని ఉన్న చెరువు, నిల్వ గృహాన్ని కూడా చీమలు జాగ్రత్తగా ప్లాన్ చేశాయి, ఇది ఆలయ ఆధ్యాత్మిక ప్రకాశాన్ని పెంచుతుంది.
ఈ ఆలయం చెక్కతో తయారు చేయబడింది. చాలా ఆకర్షణీయంగా.. అందంగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో అనేక అంతస్తులు ఉన్నాయి. కుటుంబ దేవతల చిహ్నాలు పైకప్పులపై చెక్కబడి ఉన్నాయి. పైకప్పుకు బర్క్స్ కలపతో చేసిన జింక తల ఉంది. పైకప్పు నుంచి ఎగురుతున్న గద్దలు కూడా చూడవచ్చు. దాని ప్రధాన ద్వారం వద్ద చెక్క పులుల విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి. అవి ఆలయానికి కాపలా కాస్తున్నట్లు అనిపిస్తుంది. గర్భగుడి గోడలపై హిందూ గ్రంథాల గుర్తులు కనిపిస్తాయి. ఈ ఆలయం వెలుపల ఒక మెట్ల బావి కూడా ఉంది. ఇది ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది.
శతాబ్దాలుగా చిండి మాత ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు దూర ప్రాంతాల నుండి వస్తున్నారు. మాత చండిపై భక్తులకు అచంచలమైన విశ్వాసం ఉంది. ఈ ఆలయం గురించి ఒక నమ్మకం ఏమిటంటే, ఇక్కడకు వచ్చే పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతారు.
ఈ గుడిలోని అమ్మవారు గుడిని వదిలి ఎక్కడికీ వెళ్ళదు. పురాణాల ప్రకారం ఒకసారి సుకేత్ రాష్ట్ర రాజు లక్ష్మణ్ సేన్ దేవతను సుందర్‌నగర్‌కు తీసుకురావడానికి ప్రయత్నించాడు. అయితే అతని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. గది నుంచి బయటకు రాగానే, అష్టధాతు విగ్రహం నల్లగా మారిపోయింది. రాజు అమ్మవారు కోపాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తర్వాత రాజు స్పృహలోకి వచ్చి అమ్మవారికి క్షమాపణ చెప్పాడు.
ఆగస్టు 2 నుంచి 4 వరకు చిండి మాత ఉత్సవం జరుగుతుంది, ఈ రోజుల్లో అమ్మవారు తన భక్తులకు దర్శనం ఇవ్వడానికి బయటకు వస్తుంది. ఈ సమయంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. అమ్మ సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే బయటకు వస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు