శుక్రవారం నమాజ్… సోమవారం నాగదేవతకు పూజ.. మత సామరస్యాన్ని చాటుతున్న ఓ ముస్లిం మహిళ

| Edited By: Surya Kala

Oct 17, 2024 | 5:31 PM

జరీనా అనే ముస్లిం మహిళ ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా రోజురోజుకు పెరుగుతూ పాము పుట్ట వెలసింది. దీంతో ఆ ముస్లిం మహిళ జరీనా... హిందూ సాంప్రదాయంలో నాగదేవతను పూజిస్తూ వస్తుంది. ఇంట్లో వెలసిన పాము పుట్టకు నిత్యం పూజలు చేయడం ప్రారంభించింది. దీంతో చుట్టుపక్కల హిందూ భక్తులు కూడా జరీనా ఇంటికి వచ్చి పుట్టకు పూజలు చేయడం ప్రారంభించారు. అలా హిందూ సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేస్తూ భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెడుతుంది జరీనా.

శుక్రవారం నమాజ్... సోమవారం నాగదేవతకు పూజ.. మత సామరస్యాన్ని చాటుతున్న ఓ ముస్లిం మహిళ
Nagadevata Puja
Follow us on

శుక్రవారం నమాజ్ చేస్తుంది.. సోమవారం నాగదేవతకు పూజ చేస్తుంది. కుల,మతాలకు అతీతంగా ఓ ముస్లిం మహిళ ఇంట్లో వెలసిన పుట్టకు పూజ చేస్తూ.. నాగదేవతను కొలుస్తుంది. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం అయ్యవారిపల్లిలో జరీనా అనే ముస్లిం మహిళ ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా రోజురోజుకు పెరుగుతూ పాము పుట్ట వెలసింది. దీంతో ఆ ముస్లిం మహిళ జరీనా… హిందూ సాంప్రదాయంలో నాగదేవతను పూజిస్తూ వస్తుంది. ఇంట్లో వెలసిన పాము పుట్టకు నిత్యం పూజలు చేయడం ప్రారంభించింది. దీంతో చుట్టుపక్కల హిందూ భక్తులు కూడా జరీనా ఇంటికి వచ్చి పుట్టకు పూజలు చేయడం ప్రారంభించారు. అలా హిందూ సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేస్తూ భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెడుతుంది జరీనా.

ముస్లిం మహిళ అయినప్పటికీ జరీనా.. శుక్రవారం నమాజ్ చేసి..సోమవారం హిందూ సాంప్రదాయంలో నాగ దేవతకు పూజలు చేయడం పట్ల స్థానికులు అన్ని కులాల వారు జరీనా చేసిన పనిని స్వాగతిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి తన ఇంట్లో పాము పుట్ట పెరుగుతుందని.. పాము పుట్టను తొలగించకుండా అలా ఉంచి నాగదేవతకు పూజలు చేస్తూ కొలుస్తున్నా మని అంటున్నారు జరీనా. హిందూమతం, ముస్లిం అనే మతం భేదం లేకుండా శుక్రవారం నమాజ్ చేస్తూ… సోమవారం నాగదేవతకు కుటుంబమంతా పూజలు చేస్తామని చెబుతుంది జరీనా.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..