Yadadri – Gold: యాదాద్రి ఆలయానికి మూడు కిలోల బంగారం విరాళం.. కటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి

|

Oct 28, 2021 | 6:18 PM

ఒక్క పిలుపు..వేలాది మందిని కదిలిస్తోంది. యాదాద్రికి ఆలయానికి దాతలు క్యూ కట్టారు. తమవంతుగా బంగారం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.

Yadadri - Gold: యాదాద్రి ఆలయానికి మూడు కిలోల బంగారం విరాళం.. కటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి
Minister Mallaa Reddy
Follow us on

ఒక్క పిలుపు..వేలాది మందిని కదిలిస్తోంది. యాదాద్రికి ఆలయానికి దాతలు క్యూ కట్టారు. తమవంతుగా బంగారం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుతో యాదాద్రికి వస్తున్న భక్తులకోసం ఆలయ అధికారులు ప్రత్యేకంగా హుండీ ఏర్పాటు చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ గోపురం స్వర్ణ తాపడానికి భక్తుల నుంచి విరాళాలు సేకరించేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బంగారం విరాళం కోసం ప్రత్యేక హుండీని ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌ పిలుపుతో అనేకమంది యాదాద్రికి తరలివస్తున్నారు. స్వచ్చంధంగా బంగారం విరాళాలు ఇచ్చేందుకు సిద్ధ మయ్యారు. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా హుండీని ఏర్పాటు చేయాలని భక్తులు ఆలయ అధికారులను కోరారు. ఇందులో భాగంగా చాలా మంది భక్తులు  బంగారంను అందిస్తున్నారు.

తాజాగా మేడ్చల్ నియోజకవర్గం కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చారు. యాదాద్రి ఆలయానికి మూడు కిలోల బంగారం ఇవ్వాలని నిర్ణయించారు. మంత్రి మల్లారెడ్డితో కలిసి యాదాద్రి వెళ్లిన మేడ్చల్ టీఆర్ఎస్ నేతలు మూడు కిలోల బంగారానికి అయ్యే నగదును ఆలయ అధికారులకు అందించారు. మంత్రి మల్లారెడ్డి మొత్తం రూ. 1.75 కోట్ల నగదు అందించారు. ఇందులో రూ. కోటి నగదు కాగా రూ. 75 లక్షల విలువైన చెక్కులు ఉన్నాయి.

అంతకు ముందు ఆలయ అర్చకులు, అధికారులు మంత్రి మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికారు. అనంతరం కటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఘట్‌కేసర్‌లోని క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు యాదాద్రికి ప్రదర్శనగా వెళ్లారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో యాదాద్రి అభివృద్ధికి తనవంతుగా మూడు కిలోల బంగారాన్ని ఇచ్చినట్లు మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. మేడ్చల్ నియోజకవర్గం తరపున మూడు కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. తన కుటుంబం తరపున కిలో బంగారం, నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ తరపున 2 కిలోల బంగారం సమర్పించినట్లు మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: Chat Without Internet : ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌ చాట్ చేయండి.. ఎలానో తెలుసా..

Prashant Kishor: మరో 40 ఏళ్లు అధికారం బీజేపీదే.. సమస్యంతా రాహుల్ గాంధీలోనే.. హాట్ కామెంట్ చేసిన పీకే..