ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు..! భారతదేశం అంటేనే ఎక్కువగా పండుగలు జరుపుకునే దేశం. ఇక మన భారతదేశంలో నూతన సంవత్సర వేడుకలు ముగిసిన కొన్ని రోజులకే సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంటుంది. వేర్వేరు పేర్లతో విభిన్న రీతులలో జరుపుకునే ఈ పండుగ హిందువులకు ఎంతో ప్రముఖమైనది. మృగశిర రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన రోజున ఈ మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ప్రతి ఏటా వచ్చినట్లుగానే ఈ ఏడాది కూడా జనవరి నెలలోనే వచ్చింది ఈ గాలిపటాల పండుగ. సకల జీవరాశులకు ప్రత్యక్ష దర్శనమిచ్చే సూర్య భగవానుడు ఈ నెల 14న మృగశిర రాశి నుంచి మకర రాశిలోని ప్రవేశించబోతున్నాడు. ఆ నేపథ్యంలోనే భారత్‌లో జనవరి 14న మకర సంక్రాంతిని జరుపుకోనున్నాం.
అప్పటి వరకూ పొలాల్లో ఉన్న పంట, ధాన్యం ఇంటికి చేరిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ రోజున ప్రజలంతా సూర్యుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ క్రమంలోనే గంగా నదికి, గంగా నదికి దూరంగా ఉన్నవారు స్థానిక నదులలో స్నానం చేసి నదీ ఆశీర్వాదం కోసం అర్ఘ్యం సమర్పిస్తారు. మన పంటలు సమృద్ధికరంగా పండడానికి సూర్యుడు, నదుల నీరు ఎంతో కీలకమైనవి. ఆ కారణంగానే మకర సంక్రాంతి రోజున సూర్యుడికి, నదికి కృతజ్ఞతాభావంగా ప్రజలంతా పూజలు చేస్తారు. అయితే మరి ఈ పండుగ రోజు తప్పనిసరిగా చేయవలసిన పనులు, చేయకూడని పనులేమిటో మీకు తెలుసా..? తెలియకపోయినా పర్వాలేదు. మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మకర సంక్రాంతి రోజున పవిత్ర నదులలో స్నానం చేస్తారని నమ్ముతారు. ఈ రోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవాలి. సాయంత్రం, రాత్రి వేళల్లో తినకూడదు.
నదీ జలాల్లో పవిత్ర స్నానం చేయడం, సూర్య భగవానుడు, శని దేవతలకు నైవేద్యాలు సమర్పించడం, గాలిపటాలు ఎగురవేయడం ఈ వేడుకను జరుపుకునే విలక్షణమైన మార్గాలు. ఈ సందర్భంగా మీరు తప్పనిసరిగా చేయవలసిన అనేక అంశాలు ఉన్నాయి. అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఇతరులను బాధపెట్టే లేదా ప్రకృతికి హాని కలిగించే పనులు చేయకూడదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..