Tirupati: తిరుమలలో మహేంద్ర కొత్త వాహనానికి ప్రత్యేక పూజ.. శ్రీవారికి ఆ జీప్‌ని కానుకగా ఇచ్చిన సంస్థ

Tirupati : ప్రముఖ హిందూ ఆలయాల్లో ఒకటి తిరుమల తిరుపతి ఆలయం. కలియుగ దైవం.. భక్తుల న్యాయమైన కోర్టికలను తీర్చే కల్పవల్లిగా ఖ్యాతిగాంచిన శ్రీవారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో ...

Tirupati: తిరుమలలో మహేంద్ర కొత్త వాహనానికి ప్రత్యేక పూజ.. శ్రీవారికి ఆ జీప్‌ని కానుకగా ఇచ్చిన సంస్థ
Tirupati

Updated on: Aug 27, 2021 | 9:56 AM

Tirupati : ప్రముఖ హిందూ ఆలయాల్లో ఒకటి తిరుమల తిరుపతి ఆలయం. కలియుగ దైవం.. భక్తుల న్యాయమైన కోర్టికలను తీర్చే కల్పవల్లిగా ఖ్యాతిగాంచిన శ్రీవారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయనేతలు, వ్యాపారస్తులు శ్రీవారిని దర్శించుకుని తమ శక్తిమేరకు కానుకలను సమర్పిస్తారు. మలయప్ప స్వామికి అలనాటి రాజుల నుంచి నేటి పాలకుల వరకూ బంగారం, వజ్ర వైడుర్యాల కానుకలని సమర్పిస్తూనే ఉన్నారు.

Tirupati

తాజాగా తిరుమల శ్రీవారికి గురువారం ఓ జీపు కానుకగా అందింది. మహీంద్ర సంస్థ సీఈవో దిలీప్‌ రూ.16 లక్షల విలువైన థార్‌ జీపును అందజేశారు. తొలుత శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతాలు, తాళాలను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి దాత అందజేశారు. తర్వాత ధర్మారెడ్డి దాతతో కలిసి వాహనాన్ని కొద్ది దూరం నడిపారు.

 

Also Read: AP Job Mela: ఏపీలో జాబ్ మేళా.. భారీగా ఉద్యోగానియామకాలు, టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత.. వివరాల్లోకి వెళ్తే..