Mahashivratri Special-2021 : శివుడు అభిషేక ప్రియుడు.. కానీ ఒక్కో అభిషేకానికి ఒక్కో ఫలితం ఉంటుందని మీకు తెలుసా..

|

Mar 11, 2021 | 10:07 AM

Mahashivratri Special-2021:శివుడు అభిషేక ప్రియుడు. అందుకే శివరాత్రి రోజు అందరు రకరకాల పదార్థాలతో అభిషేకిస్తారు. మహాదేవుడిని అభిషేకం ద్వారా సంతృప్తి పరిస్తే సకల సంపదలను ఇస్తాడని

Mahashivratri Special-2021 : శివుడు అభిషేక ప్రియుడు.. కానీ ఒక్కో అభిషేకానికి ఒక్కో ఫలితం ఉంటుందని మీకు తెలుసా..
Follow us on

Mahashivratri Special-2021:శివుడు అభిషేక ప్రియుడు. అందుకే శివరాత్రి రోజు అందరు రకరకాల పదార్థాలతో అభిషేకిస్తారు. మహాదేవుడిని అభిషేకం ద్వారా సంతృప్తి పరిస్తే సకల సంపదలను ఇస్తాడని భక్తల విశ్వాసం. అయితే ఈ అభిషేకాలలో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కో అభిషేకానికి ఒక్కో రకం ఫలితం దక్కుతుందని పురోహితులు చెబుతారు. అసలు శివుడిని ఏ ఏ పదార్థాలతో అభిషేకిస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

శివుడిని ఆవుపాలతో అభిషేకిస్తే సర్వ సౌఖ్యములు ప్రాప్తిస్తాయి. కుటంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉంటారు. గరిక నీటితో అభిషేకిస్తే పోయిన ధనం తిరిగి లభిస్తుందని నమ్మకం. నువ్వుల నూనెతో అభిషేకిస్తే మృత్యువును దూరం చేయొచ్చని పెద్దలు అంటుంటారు. పెరుగుతో అలంకరిస్తే బలం, ఆరోగ్యం సిద్ధిస్తుందని విశ్వాసం. ఆవు నేయితో అభిషేకిస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మెత్తటి చక్కెరతో అభిషేకిస్తే దు:ఖము నాశనమవుతుంది. తేనెతో అభిషేకిస్తే తేజో వృద్ధి కలుగుతుంది. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగిస్తుంది. రుద్రాక్ష జలాభిషేకమ వల్ల ధన ప్రాప్తి దొరుకుతుంది. భస్మాభిషేకంచే పాపాలు హరించును. బంగారం నీటితో అభిషేకం చేస్తే దరిద్రం పారిపోతుందని నమ్మకం. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు – పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు – ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెడతారు. ఇవే కాకుండా ఇంకా చాలా రకాలుగా శివుడిని అభిషేకించవచ్చు.

Mahashivratri Special-2021: శివరాత్రి వచ్చిందంటే చాలు.. అందరు కందగడ్డ వైపే చూస్తారు.. అసలు శివుడికి – కందగడ్డకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

Mahashivratri Special-2021: ఈ పూలతో పూజిస్తే శివుడు పులకించిపోతాడు.. మహాదేవుడికి ఇష్టమైన పుష్పాలు ఏంటో తెలుసా.. ?