మహాభారతం ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం. ఈ యుద్ధం వెనుక అనేక ఇతర కారణాలు ఉన్నాయి. రాజ్యం ఏక చత్రాది పత్యంగా ఎలాలనే కాంక్ష.. తన దాయాది సోదరులను చూసినప్పుడు కలిగిన అసూయతో జరిగిన యుద్ధమే కురుక్షేత్రం. అజ్ఞాత వాసం ముగిసిన అనంతరం పాండవులకు రాజ్యంలో వాటా ఇవ్వడానికి దుర్యోధనుడు నిరాకరించాడు. మహాభారత యుద్ధంలో 1 లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని నమ్ముతారు. అయితే కురుక్షేత్రం యుద్ధం జరగక కుండా చూసేందుకు భీష్ముడు, బలరాముడు సహా అనేక మంది అనేక ప్రయత్నాలు చేశారు. అలాంటి రాయభారంలో ఒకటి కృష్ణ రాయబారం. శ్రీ కృష్ణుడు పాండవుల తరపున రాయబారిగా హస్తినాపురానికి వెళ్లాడు. హస్తినాపురంలో పాండవులు రాజ్యం ఇవ్వమని.. అది కుదరక పోతే కనీసం పాండవులకు ఐదు ఊర్లు ఇవ్వమని శ్రీ కృష్ణుడు ప్రతిపాదించాడు. తద్వారా వారు జీవనోపాధి పొందగలరని పేర్కొన్నాడు.
ఐదు ఊర్లపై దుర్యోధనుడు స్పందన ఏమిటంటే
శ్రీ కృష్ణుడు పాండవుల తరపున రాయబారిగా హస్తినలోని కురు మహా సభలో అడుగు పెట్టాడు. పాండవులు ఓడిన రాజ్యం అడిగాడు. అది ఇవ్వడం కుదరదు అంటే కనీసం ఐదు గ్రామాలు ఇవ్వాలని ప్రతిపాదించాడు. అది విన్న ధృతరాష్ట్రుడు కూడా కృష్ణుని మాటలకు అంగీకరించాడు. దుర్యోధనుడిని శ్రీకృష్ణునికి విధేయత చూపమని కోరాడు. పాండవులకు ఐదు గ్రామాలను ఇచ్చి రానున్న యుద్ధాన్ని నివారించాలని చెప్పాడు. అయితే కృష్ణుడి ఐదు ఊర్ల ప్రతిపాదనను దుర్యోధనుడు ఆగ్రహించాడు. అంతేకాదు ఆ పాండవులకు ఐదు ఊర్లు కాదు కదా సూది మొనకు సమానమైన భూమిని ఇవ్వను. ఒక వేళ యుద్ధమే తప్పదంటే తాము యుద్ధానికి సిద్ధం అని చెప్పాడు. అయితే నాడు శ్రీ కృష్ణుడు అడిగిన ఊరు.. నేటి ప్రాంతాలు అవి ఏమిటో తెలుసా..
ఆ ఐదు గ్రామాలు ఏమిటంటే
శ్రీ కృష్ణుడు పాండవుల కోసం కోరిన ఐదు గ్రామాలలో ఇంద్రప్రస్థం మొదటి గ్రామం. దీనిని శ్రీపత్ అని కూడా అంటారు. దీనిని ఈరోజు ఢిల్లీ అని పిలుస్తారు. ఇది పాండవుల రాజధానిగా పరిగణించబడుతుంది. పాండవులు ఖాండవప్రస్థ వంటి నిర్జన ప్రదేశంలో ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించుకున్నారు. శ్రీ కృష్ణుని కోరిక మేరకు మాయాసురుడు ఇక్కడ ఒక రాజభవనాన్ని, కోటను నిర్మించాడు. అక్కడ నేటికీ ఒక పాత కోట ఉంది. ఈ ప్రదేశంలో పాండవుల ఇంద్రప్రస్థం ఉండేదని ప్రతీతి.
బాగ్‌పత్
మహాభారత కాలంలో బాగ్‌పత్‌ను వ్యాఘ్రప్రస్థ అని పిలిచేవారు. వ్యాఘ్రప్రస్థ అంటే పులులు నివసించే ప్రదేశం అని అర్థం. వందేళ్ల క్రితం ఇక్కడ చాలా పులులు నివసించేవి. మొఘల్ కాలం నుండి బాగ్‌పత్ అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఇది. బాగ్‌పత్‌లోనే కౌరవులు లక్షగృహాన్ని (లక్క ఇల్లుని) నిర్మించి పాండవులను అగ్నిలో దహనం చేయడానికి కుట్ర పన్నారు. బాగ్‌పత్ జిల్లా జనాభా 50 వేల కంటే ఎక్కువ.
పానిపట్
పానిపట్‌ను పాండుప్రస్థ అని కూడా అంటారు. పానిపట్ ఢిల్లీకి 90 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్‌లో ఉంది. దీనిని ‘సీటీ ఆఫ్ వీవర్’ అని కూడా పిలుస్తారు, దీని అర్థం ‘వీవర్స్ నగరం’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ప్రదేశం భారతీయ చరిత్రలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ 3 ప్రధాన యుద్ధాలు జరిగాయి. పానిపట్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో కౌరవులకు, పాండవులకు మధ్య యుద్ధం జరిగిన ప్రదేశం కురుక్షేత్రం ఉంది.
తిలపట్
తిల్పత్‌ను గతంలో తిల్‌ప్రస్థ అని కూడా పిలిచేవారు. ఇది హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం. ఈ ప్రదేశం యమునా నది ఒడ్డున ఉంది. ఇక్కడ జనాభా 40 వేలకు పైగా ఉంది.
సోనిపట్
సోనిపట్‌ను గతంలో స్వర్ణప్రస్థ అని పిలిచేవారు. తరువాత దాని పేరు సోన్‌ప్రస్థ నుండి సోనిపట్‌గా మార్చబడింది. స్వర్ణ మార్గం అంటే బంగారు నగరం. నేడు ఈ గ్రామం హర్యానా రాష్ట్రంలోని జిల్లా.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండ్
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు