Maha Shivratri 2024: మహా శివరాత్రి ఏ రోజు మార్చి 8 లేదా 9? శివ పూజా తేదీ, శుభ సమయం తెలుసుకోండి

|

Feb 24, 2024 | 7:10 AM

మహా శివరాత్రి రోజున పూజ చేయడానికి నిశిత కాల కాలాన్ని ఎంచుకుంటారు. శివాధన నిశిత కాల సమయంలో మాత్రమే చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిశిత కాలపు శుభ సమయం మార్చి 8వ తేదీ తెల్లవారు జామున 12:05 గంటలకు ప్రారంభమై 12:56 AM వరకు ఉంటుంది. ఈసారి నిశిత కాలము 51 నిమిషాల పాటు మాత్రమే ఉంది. అందువల్ల ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ ఉపవాసం, పూజలు మార్చి 8  2024 శుక్రవారం రోజున చేస్తారు. 

Maha Shivratri 2024: మహా శివరాత్రి ఏ రోజు మార్చి 8 లేదా 9? శివ పూజా తేదీ, శుభ సమయం తెలుసుకోండి
Maha Shiva Ratri 2024
Image Credit source: pexels
Follow us on

లయకారుడైన శివుడికి మహాశివరాత్రి పర్వదినం అత్యంత ఇష్టమైన రోజు. మాఘ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహా శివ రాత్రి పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం శివ పార్వతుల వివాహం జరిగిన రోజు.. అంతేకాదు లింగోద్భవం జరిగిన రోజు మహా శివరాత్రి అని విశ్వాసం. అందుకే మహా శివ రాత్రి పండుగ ఆదిదంపతులైన శివపార్వతులకు అంకితం చేయబడింది. విశ్వాసాల ప్రకారం ఆచారాల ప్రకారం ఈ రోజున శివుడుపార్వతిను పూజించడం, ఉపవాసం చేయడం ద్వారా ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం. అంతేకాదు దుఃఖం, బాధల నుంచి ఉపశమనం పొందుతారు. ఈసారి చతుర్దశి తిధి ఎప్పుడు వచ్చింది.. మహా శివరాత్రి పండగను ఏ రోజు జరుపుకుంటారు… ఖచ్చితమైన తేదీ. శుభ సమయం గురించి తెలుసుకుందాం..

మహా శివరాత్రి ఎప్పుడు?

హిందూ తెలుగు క్యాలెండర్ ప్రకారం.. మాఘ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తేదీ మార్చి 8, 2024 రాత్రి 09:57 గంటలకు ప్రారంభమై మార్చి 9, 2024 సాయంత్రం 06:17 గంటలకు ముగుస్తుంది.

మహా శివరాత్రి రోజున పూజ చేయడానికి నిశిత కాల కాలాన్ని ఎంచుకుంటారు. శివాధన నిశిత కాల సమయంలో మాత్రమే చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిశిత కాలపు శుభ సమయం మార్చి 8వ తేదీ తెల్లవారు జామున 12:05 గంటలకు ప్రారంభమై 12:56 AM వరకు ఉంటుంది. ఈసారి నిశిత కాలము 51 నిమిషాల పాటు మాత్రమే ఉంది. అందువల్ల ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ ఉపవాసం, పూజలు మార్చి 8  2024 శుక్రవారం రోజున చేస్తారు.

ఇవి కూడా చదవండి

2024 మహాశివరాత్రి పూజా సమయం

హిందువుల పంచాంగం ప్రకారం మార్చి 8వ తేదీ శుక్రవారం రోజున చతుర్దశి గడియలు రాత్రి ప్రారంభమవుతాయి. కనుక మహాశివరాత్రి రోజున సాయంత్రం 6:25 నుండి 9:28 వరకు శివుడిని పూజించడానికి అనుకూలమైన సమయం.

మహా శివరాత్రి 2024 నాలుగు ఘడియల్లో పూజ చేయడానికి ముహూర్తం

మొదటి గడియ రాత్రి పూజ సమయం – మార్చి 8వ తేదీ సాయంత్రం 6:25 నుండి 9:28 వరకు

రాత్రి రెండవ గడియలో పూజ సమయం – మార్చి 8వ తేదీ 9:28 నుండి 12:31 శుభ సమయం..

రాత్రి మూడవ గడియలో పూజ సమయం – తెల్లవారు జాము 12.31 నుంచి 3.34 వరకు శుభ సమయం

నాలుగు గడియలో పూజ సమయం – మార్చి 9, ఉదయం 3:34 నుంచి 6:37 వరకు శివయ్య పూజకు శుభ సమయం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు