Shivaratri 2022: రెండేళ్ల తర్వాత శివరాత్రికి వెల్లంగిరి కొండలలో మహాశివరాత్రి యాత్ర.. దేశ, విదేశీయుల భక్తులతో కిటకిట

| Edited By: Ravi Kiran

Mar 01, 2022 | 7:55 PM

Maha Shivaratri 2022: కొండలలో ఉన్న శివయ్య(Lord Shiva)ని దర్శించుకోవాలంటే పర్వతారోహణ చేయాల్సిందే ....కిలోమీటర్ల మీటర్ల దూరం ప్రయాణం, స్వయంభు లింగం గా ఉన్న శివలింగం, ..

Shivaratri 2022: రెండేళ్ల తర్వాత శివరాత్రికి వెల్లంగిరి కొండలలో మహాశివరాత్రి యాత్ర.. దేశ, విదేశీయుల భక్తులతో కిటకిట
Velliangiri Andavar Hills T
Follow us on

Maha Shivaratri 2022: కొండలలో ఉన్న శివయ్య(Lord Shiva)ని దర్శించుకోవాలంటే పర్వతారోహణ చేయాల్సిందే ….కిలోమీటర్ల మీటర్ల దూరం ప్రయాణం, స్వయంభు లింగం గా ఉన్న శివలింగం, ..మూడు కొండలను దాటి వెళ్లి దక్షిణ కైలాసాన్ని దర్శించనున్న భక్తులు ..మంచు కప్పిన కొండలను దాటుకుంటూ యాత్ర కొనసాగించిన భక్తులు, వేలాదిగా వచ్చిన భక్తులతో పాటు యాత్ర కొనసాగించిన విదేశీయులు …వెల్లంగిరి కొండలు మహాశివరాత్రి శోభను సంతరించుకున్నాయి.

కోయంబత్తూరు జిల్లాలోని పశ్చిమ కనుమల మీద ఉన్న బూండి వెల్లియంగిరి శివాలయాన్ని వార్షిక మహా శివరాత్రి నాడు దర్శించుకోవడానికి భక్తులకు అనుమతిస్తారు. కరోనా వ్యాప్తి కారణంగా గత 2 సంవత్సరాలుగా అనుమతి ఇవ్వలేదు .ఈ క్రమంలో ఈ సంవత్సరం ఆలయ దర్శనానికి అధికారులు అనుమతివ్వడంతో వెల్లింగిరి కొండ ఎక్కేందుకు భక్తులకు అనుమతి లభించింది. వెల్లింగిరి కొండ ఎక్కేందుకు కోయంబత్తూరు జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాలైన తిరుపూర్, ఈరోడ్, మదురై, చెన్నై, తిరుచ్చి తదితర తమిళనాడు జిల్లాల నుంచి కూడా అనేక మంది భక్తులు కోయంబత్తూరుకు వచ్చారు. పాదయాత్రకు ముందు భక్తులందరినీ అటవీ అధికారులు చెక్‌పోస్టు వద్ద ఆపి తనిఖీ చేసి పూర్తి ఆరోగ్యం తో ఉన్నవారికి మాత్రమే పర్వతారోహణకు అనుమతించారు. అలాగే వన్యప్రాణుల సంచారం ఉన్నందున తగిన జాగ్రత్తలను చెప్పారు. భక్తులు గుంపులుగా వెళ్లాలని, ఎవరూ ఒంటరిగా వెళ్లకూడదని అటవీశాఖ అధికారులు చెప్పిన జాగ్రత్తలు భక్తులు పాటించాలని చెత్త వేయకుండా చూడాలని సూచించారు. 2 ఏళ్ల తర్వాత ట్రెక్కింగ్ అనుమతి లభించడంతో వెల్లియంగిరికి వచ్చే యాత్రికుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడం గమనార్హం.

Also Read:

పెళ్లికాని ప్రసాదులకు గుడ్ న్యూస్.. ఆ గ్రామంలో అందమైన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు.. కండిషన్స్ అప్లై..