Maha Kumbhamela: కుంభమేళా వెళ్లే తెలుగువారికి గుడ్ న్యూస్.. ప్రయగ్ రాజ్ కు స్పెషల్ ట్రైన్స్.. ఎక్కడ నుంచి అందుబాటులో ఉండనున్నయంటే..

|

Jan 03, 2025 | 7:58 AM

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే భక్తుల సౌకర్యార్ధం ఏర్పాట్లపై యోగి సర్కార్ దృష్టి పెట్టింది. ప్రపంచం దృష్టి ఆకర్షించేలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ భారీ సంఖ్యలో భక్తులు కుంభ మేళాలో పాల్గొంటారని భావిస్తున్న రైల్వే శాఖ ప్రయాణీకుల సౌకర్యార్ధం మరిన్ని రైళ్ళను నడడం కోసం రెంగం సిద్ధం చేసింది. దక్షిణ మధ్య రైల్వే శాఖ సైతం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారి కోసం స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేసింది.

Maha Kumbhamela: కుంభమేళా వెళ్లే తెలుగువారికి గుడ్ న్యూస్.. ప్రయగ్ రాజ్ కు స్పెషల్ ట్రైన్స్.. ఎక్కడ నుంచి అందుబాటులో ఉండనున్నయంటే..
Special Trains For Kumbh Mela 2025
Follow us on

12 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభ మేళా కోసం యావత్ ఆధ్యాత్మిక ప్రపంచం ఎదురు చూస్తోంది. ఇప్పటికే పవిత్ర ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 13వ తేదీ నుంచి ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ప్రారంభమవుతోంది. దేశ విదేశాల భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించే అవకాశం ఉందని అంచనా వేసిన యుపీ సర్కార్ అందుకు తగిన విధంగా సౌకర్యాలను కల్పిస్తోంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళా కొనసాగుతుంది. సుమారు 45 రోజుల పాటు సాగనున్న ఈ కుంభ మేళాలో పాల్గొనడానికి పవిత్ర తివేణీ సంగమం వద్ద స్నానం చేసి దాన ధర్మాలు చేయాలనీ ప్రతి హిందువు కోరుకుంటారు. మహా కుంభ వేడుకలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వెళ్తారని భావిస్తున్న రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్స్ ను నడపడానికి నిర్ణయం తీసుకుంది.

కుంభ మేళా కోసం ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక  రైళ్లను నడుపుతోన్న రైల్వే శాఖ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వెళ్లేవారి కోసం అదనంగా మరో 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్‌ నుంచి తెలంగాణలోని మౌలాలి జంక్షన్‌, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.

 

ఇవి కూడా చదవండి

 

భక్తుల అవసరాలు, భద్రత కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో 45 కోట్ల మంది భక్తులు పాల్గొని గంగాస్నానం ఆచరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుంభమేళా నిర్వహణ కోసం రూ.7500 కోట్లు కేటాయించింది యూపీ సర్కార్‌. 50 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు.

అంతేకాకుండా ఏఐ టెక్నాలజీతో వార్‌రూమ్‌ ఏర్పాటు చేసి కుంభమేళా జరుగుతున్న ప్రాంతంపై డేగ కన్నుపెట్టారు. భక్తులు కుంభ మేళాలో ఆయా ప్రదేశాలకు వెళ్లేందుకు ఆంగ్లం, హిందీ, ప్రాంతీయ భాషల్లో 800 బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహా కుంభమేళాను ప్రపంచం దృష్టి ఆకర్షించేలా నిర్వహించేందుకు యోగి సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభ స్నానం ప్రారంభమవుతుంది. కుంభమేళ సమయంలో నదీ స్నానం చేస్తే మోక్షం కలుగుగుతుందనేది భక్తులు విశ్వాసం.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..