Kumbh Mela 2021: కోవిడ్ నిబంధనలతో కుంభ‌మేళా.. ఏప్రిల్ 1న ప్రారంభం కానున్న ఉత్సవాలు

Kumbh Mela 2021: గంగా నది ఒడ్డునున్న హరిద్వార్ నగరంతోపాటు అలహాబాద్, ఉజ్జయిని, నాసిక్‌లో కుంభమేళాను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గంగానదిలో పవిత్ర స్నానం

Kumbh Mela 2021: కోవిడ్ నిబంధనలతో కుంభ‌మేళా.. ఏప్రిల్ 1న ప్రారంభం కానున్న ఉత్సవాలు
Kumbh Mela 2021
Follow us

|

Updated on: Mar 03, 2021 | 2:50 PM

Maha Kumbh Mela 2021 : దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కోనసాగుతోంది. ఈ తరుణంలో.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మహా కుంభమేళ ప్రారంభకానుంది. కుంభ‌మేళా ప్రతి ప‌న్నేండు ఏళ్లకు ఒక‌సారి జరుగుతుంది. ఈ మహాకుంభ్ జనవరి 14న మకర సంక్రాంతి రోజున ప్రారంభమై.. ఏప్రిల్ 27 చైత్ర పూర్ణిమ వరకు కొనసాగనుంది. గంగా నది ఒడ్డునున్న హరిద్వార్ నగరంతోపాటు అలహాబాద్, ఉజ్జయిని, నాసిక్‌లో కుంభమేళాను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించడం వలన మోక్షం లభిస్తుందని, వ్యాధులు, పాపల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల అపార విశ్వాసం. ఈ కుంభంలో ప్రధానంగా 4 షాహిస్నాన్ ఘాట్‌లు, 6 ప్రధాన స్నాన్ ఘాట్‌లుంటాయి.

క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో కుంభ‌మేళా జరిగే రోజుల‌ను త‌గ్గించాల‌ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనిలో భాగంగా ఈ ఏడాది కుంభ‌మేళాను కేవ‌లం 30 రోజుల్లో మాత్రమే నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మార్చి చివ‌రినాటికి స్పష్టమైన ప్రకటన విడుదలయ్యే అవకాశముంది. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వ‌ర‌కు కుంభ‌మేళా జరగనుంది. అయితే ఈ కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కుంభ‌మేళాకు త‌ర‌లివ‌చ్చే భ‌క్తులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష చేయించుకోవాలి. పరీక్షల్లో నెగిటివ్ వ‌స్తేనే కుంభ‌మేళాకు అనుమ‌తి ఉంటుంద‌ని వెల్లడించింది. కోవిడ్ రిపోర్టు లేక‌పోతే ఎట్టి ప‌రిస్థితుల్లో అనుమ‌తి ఉండ‌ద‌ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. భ‌క్తుల ర‌ద్దీని పర్యవేక్షించేందుకు వీలుగా ఘాట్ల వ‌ద్ద సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. కానీ క‌రోనా వైర‌స్ వ్యాప్తి దృష్ట్యా ఈ సారి కేవ‌లం 30 రోజుల‌కే ప‌రిమితం చేశారు. ఈ మేరకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కుంభమేళా నిర్వహణ బాధ్యను తీసుకుంటుంది. అయితే కోవిడ్ నేపథ్యంలో.. మహా కుంభమేళాను పకడ్భందీగా నిబంధనలతో నిర్వహించనున్నారు.

Also Read:

South India Famous Temples : దక్షిణ భారతదేశంలోని అందమైన ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు వాటి.. విశిష్టత

భారత్‏లో ప్రసిద్ధి చెందిన 12 జ్యోతిర్లింగాలు.. ఏ పేర్లతో పిలుస్తారు.. ఎక్కడున్నాయంటే..

అమ్మో.. ఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ
అమ్మో.. ఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ
దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. కొత్త కోపైలట్ ప్రో ఆవిష్కరణ
దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. కొత్త కోపైలట్ ప్రో ఆవిష్కరణ
ప్రేమ పేరుతో నయవంచన! భార్య మెడలో తాళి తెంచి.. నడిరోడ్డుపై వదిలేసి
ప్రేమ పేరుతో నయవంచన! భార్య మెడలో తాళి తెంచి.. నడిరోడ్డుపై వదిలేసి
టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..
రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..