Magha Purnima: నేడు మాఘ పూర్ణిమ..పూజా విధానం.. లక్ష్మి, విష్ణువుల ప్రసన్నం కోసం ఏమి చేయాలంటే..

|

Feb 24, 2024 | 6:35 AM

మాఘ పూర్ణిమ రోజున ఉదయాన్నే నిద్రలేచి.. కాలకృత్యాలు తీర్చుకుని ఇంటిని పూర్తిగా శుభ్రం చేయండి. అనంతరం  వీలయితే నదీ స్నానం చేయండి. విశ్వాసం ప్రకారం మాఘ పూర్ణిమ రోజున బ్రహ్మ ముహూర్తంలో గంగా స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే నదిలో స్నానం చేయడం సాధ్యం కాకపోతే స్నానపు నీటిలో గంగాజలం కలిపి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన, పసుపు దుస్తులు ధరించండి.

Magha Purnima: నేడు మాఘ పూర్ణిమ..పూజా విధానం.. లక్ష్మి, విష్ణువుల ప్రసన్నం కోసం ఏమి చేయాలంటే..
Magh Purnima 2024
Follow us on

హిందూ మతంలో మాఘ పూర్ణిమకు చాలా ప్రాముఖ్యత ఉంది. మాఘ పూర్ణిమ విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజున ఆచారాల ప్రకారం శ్రీ మహా విష్ణువు, లక్ష్మి దేవిని పూజించడం వల్ల పుణ్యం లభిస్తుందని.. శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. మాఘ పూర్ణిమ రోజు చాలా విశిష్టమైన రోజు అని హిందువుకుల విశ్వాసం. ఈ రోజున సూర్యచంద్రులిద్దరికీ అర్ఘ్యం సమర్పించే సంప్రదాయం ఉంది. ఇలా చేయడం వల్ల తీవ్రమైన వ్యాధుల నుండి కూడా ఉపశమనం పొందుతారని నమ్ముతారు. నేడు మాఘ పూర్ణిమ కనుక ఈ రోజున నది స్నానం చేసి శ్రీ మహా విష్ణువును ఎలా పూజించాలో తెలుసుకుందాం.

మాఘ పూర్ణిమ రోజున ఎలా పూజ చేయాలంటే 

మాఘ పూర్ణిమ రోజున ఉదయాన్నే నిద్రలేచి.. కాలకృత్యాలు తీర్చుకుని ఇంటిని పూర్తిగా శుభ్రం చేయండి. అనంతరం  వీలయితే నదీ స్నానం చేయండి. విశ్వాసం ప్రకారం మాఘ పూర్ణిమ రోజున బ్రహ్మ ముహూర్తంలో గంగా స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే నదిలో స్నానం చేయడం సాధ్యం కాకపోతే స్నానపు నీటిలో గంగాజలం కలిపి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన, పసుపు దుస్తులు ధరించండి. అనంతరం రాగి పాత్రను  తీసుకుని నీరు, పువ్వులు వేసి ఓం నమో నారాయణాయ మంత్రాన్ని పఠిస్తూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి.

ఇవి కూడా చదవండి

ఆ తరువాత సత్యనారయణ స్వామి చిత్రపటం ముందు ధూపం, దీపం వెలిగించి పూజను ప్రారంభించండి. దేవుడికి చరణామృతం, నెయ్యి, పంచదార, ప్రసాదం, నీరు, నువ్వులు, బియ్యం, పసుపు, కుంకుమ, పండ్లు, పువ్వులు, పంచగవ్య, తమలపాకులు తులసి, దర్భలను సమర్పించండి. ఇప్పుడు సత్యనారయణ భగవానుని పూజించి.. వ్రత కథను పఠించండి. పూజ చివరిలో హారతిని ఇచ్చి ముగింపులో భాగంగా పూజలో ఏమైనా లోటు పాట్లు ఉన్నా.. ఏదైనా తెలిసి తెలియక తప్పు, పొరపాట్లు చేసినా క్షమించమని దేవుడిని వేసుకోండి.

ఈ రోజు రాత్రి లక్ష్మీ దేవిని పూజించి, చంద్రోదయం తర్వాత నీటిలో పంచదార, అక్షతలు కలిపి చంద్రునికి అర్ఘ్యం సమర్పించండి. ఈ సమయంలో ఓం శ్రీ శ్రీ చంద్రాంశే నమః అనే మంత్రాన్ని పఠించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుందని, చంద్ర దోషాలు తొలగిపోయి కుటుంబంలో ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు