ఈనెల 5వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ సంవత్సరం ఏర్పడే తొలి చంద్రగ్రహణం ఇదే. . అయితే చంద్రగ్రహణం రోజున కొన్ని రాశుల వారు దానిని చూడటం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా చంద్రగ్రహణం రోజు కొన్ని ప్రత్యేక రాశి వారు గ్రహణం చూడటం అశుభంగా పరిగణిస్తారు. అలాగే చంద్రగ్రహణం ద్వారా రాహువు ఆయా రాశులపై ప్రభావం చూపిస్తాడు ఫలితంగా సమాచారం అంతా దరిద్రం వెంట తరిమే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చంద్రగ్రహణం చూసేందుకు ఏ ఏ రాశుల వారు దూరంగా ఉండాలి. ఒకవేళ చూస్తే ఎలాంటి దోష నివారణలు చేయించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే నిజానికి ఈ సంవత్సరం ఏర్పడే తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. . కావున విదేశాల్లో ఉన్న భారతీయులు మాత్రమే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తద్వారా చంద్రగ్రహణ ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది.
ఈ సంవత్సరం చంద్రగ్రహణం సందర్భంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని శాస్త్ర నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గర్భిణీలు ఇంటి నుండి బయటకు రాకూడదు, గ్రహణ సమయంలో మీరు ఆహారం తినకూడదు. గ్రహణ కాలంలో పూజలకు దూరంగా ఉండండి. అంతే కాకుండా కూరగాయలు కోసేందుకు కత్తి వంటి సాధనాలను ఉపయోగించవద్దు.
ఈ పనులు చేయడం మానుకోండి:
చంద్రగ్రహణం సమయంలో కోపానికి దూరంగా ఉండాలని శాస్త్ర నిపుణులు అంటున్నారు. గ్రహణ కాలంలో మీరు ఎవరితోనైనా కోపం తెచ్చుకుంటే, రాబోయే 15 రోజులు మీకు పెద్ద ఇబ్బందిని కలిగిస్తాయి. గ్రహణ సమయంలో, ఏ నిర్జన భూమి లేదా స్మశానవాటిక వైపు వెళ్లవద్దు, లేకపోతే జీవితంలోని ఆనందం శాశ్వతంగా పోతుంది. గ్రహణ పరిస్థితిలో, భార్యాభర్తలు శారీరక సంబంధాలకు దూరంగా ఉండాలి. లేకుంటే జీవితంలో ఆనందం నాశనం అవుతుంది.
చంద్రగ్రహణం ముఖ్యంగా ఈ సంవత్సరం ఐదు రాశుల వారికి చాలా ప్రమాదం అనే చెప్పాలి ఆ ఐదు రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ధనస్సు రాశి:
చంద్రగ్రహణం పూర్తయిన వెంటనే ఈ రాశి వారు ఆంజనేయుడు స్వామి గుడికి వెళ్లి దీపం ముట్టించాలి లేకపోతే సంవత్సరం అంతా శని మీ నట్టింట తాండవిస్తుంది.
సింహరాశి:
చంద్రగ్రహణం పూర్తయిన వెంటనే ఈ రాశి వారు మీ సమీపంలోని పాము పుట్ట వద్దకు వెళ్లి పంచదార వేసి కొబ్బరికాయ కొట్టి 11 ప్రదక్షిణలు చేయాలి లేకపోతే ఈ సంవత్సరం భారీ ధన నష్టం వచ్చే అవకాశం ఉంది.
కన్యా రాశి:
చంద్రగ్రహణం పూర్తయిన తరువాతి రోజు శివాలయానికి వెళ్లి, కొబ్బరికాయ కొట్టి కర్పూరంతో దీపం వెలిగించి. పంచాక్షరి మంత్రం పఠించండి. లేకపోతే ఈ సంవత్సరం చాలా కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
మీన రాశి:
చంద్రగ్రహణం పూర్తయిన తెల్లవారే ఆంజనేయుడు గుడికి వెళ్లి మినప్పప్పు తో చేసిన వడలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.
గ్రహణం వ్యవధి ఎంత:
ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 5న ఏర్పడనుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇది రాత్రి తర్వాత 8:44 నుండి 1:20 వరకు ఉంటుంది. గ్రహణం రోజున స్నానం చేసి పేదలకు దానం చేయాలి. గ్రహణం ముగిసిన తరువాత, ఇంటిని శుద్ధి చేసి, అవసరమైన వారికి బట్టలు దానం చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).