Lunar Eclipse 2022: బుద్ధపూర్ణమి రోజున చంద్రగ్రహణం.. గ్రహణ కాలంలో పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసా..!

|

May 12, 2022 | 9:12 PM

2022 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది, దాని వ్యవధి ఎంత, సూతకం కాలం ఎప్పటి నుండి వర్తిస్తుంది వంటి అన్ని విషయాలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి.

Lunar Eclipse 2022: బుద్ధపూర్ణమి రోజున చంద్రగ్రహణం.. గ్రహణ కాలంలో పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసా..!
Lunar Eclipse 2022
Follow us on

Lunar Eclipse 2022: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం(Solar Eclips) ఏప్రిల్ 30న సంభవించింది. ఇక ఈ ఏడాది మొదటి  చంద్రగ్రహణం(Chandra Grahanam) ఈ నెల 16న ఏర్పడనుంది. చంద్రగ్రహణం పౌర్ణమి రోజున ఏర్పడనుంది. అదే రోజు బుద్ధ పూర్ణిమ. ఈసారి చంద్రగ్రహణం వృశ్చికరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం, చంద్రగ్రహణం  కాల వ్యవధి 1 గంట 24 నిమిషాలు. ఇది మే 16, సోమవారం 07:59కి ప్రారంభమై 10:23కి ముగుస్తుంది. 2022లో రెండు చంద్రగ్రహణాలు వస్తాయని.. ఆ రెండూ సంపూర్ణ చంద్రగ్రహణాలు. ఈ రోజు చంద్ర గ్రహణానికి సంబంధించిన  కొన్ని నియమాలు, ముఖ్యమైన విషయం తెలుసుకుందాం..

చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుందంటే?
మే 16న ఏర్పడనున్న చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇది దక్షిణ-పశ్చిమ ఐరోపా, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్, అంటార్కిటికాలో కనిపించనుంది.

చంద్రగ్రహణ సమయం: 
చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతకం ప్రారంభమవుతుంది. సూతకంలో శుభకార్యాలు చేయడం నిషేధించబడింది. మే 16న చంద్ర గ్రహణం కనుక.. సూతకం మే 15, ఆదివారం 10:58 గంటలకు ప్రారంభమై మే 16, సోమవారం ఉదయం 11.58 గంటలకు ముగుస్తుంది. కానీ ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కనుక సూతకం కూడా ఇక్కడ చెల్లదు. గ్రహణం కనిపించే దేశాలలో సూతక కాలం చెల్లుతుంది.

ఇవి కూడా చదవండి

చంద్రగ్రహణం సమయంలో ఏమి చేయాలి.. ఏమి చేయకూదంటే.. 
సూతకం చెల్లుబాటయ్యే ప్రదేశాల్లో.. సూతకం మొదలైన అనంతరం..  గ్రహణం పూర్తయ్యే వరకు పూజలు చేయరు. దేవుడిని జపం చేయాలి. అంతేకాదు.. సూతకం మొదలు కావడానికి ముందు తులసి ఆకులను, లేదా దర్భలను ఆహార పదార్థాలలో వేయండి. గ్రహణ సమయంలో గర్భిణులు బయటకు వెళ్లకూడదు. గ్రహణం ముగిసిన తరువాత. ఇంటిని శుభ్రం చేసుకోవాలి. స్నానమాచరించాలి. అనంతరం.. అవసరమైన వారికి ఆహార ధాన్యాలు, బట్టలు మొదలైనవి దానం చేయాలని సూచిస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..