Lord Shiva: ఆర్ధిక కష్టాలా, వివాహం ఆలస్యం అవుతుందా.. సోమవారం శివయ్య పూజలో ఈ పరిహారాలు చేసి చూడండి

|

Apr 03, 2023 | 9:58 AM

మీ కోరికలు ఏవైనా నెరవేరకపోతే, సోమవారం రోజున ఉపవాసం ఉండటం, కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల శుభ  ఫలితాలు లభిస్తాయి. సోమవార పూజ చేసే వ్యక్తికి మాత్రమే కాకుండా మొత్తం కుటుంబానికి కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు సోమవారం రోజున శివయ్య పూజ కోసం చేయాల్సిన పూజా విధానం ఏమిటో తెలుసుకుందాం.

Lord Shiva: ఆర్ధిక కష్టాలా, వివాహం ఆలస్యం అవుతుందా.. సోమవారం శివయ్య పూజలో ఈ పరిహారాలు చేసి చూడండి
Lord Shiva
Follow us on

సనాతన హిందూ ధర్మంలో వారంలో ప్రతి రోజు ఏదో ఒక దేవతకి అంకితం చేయబడిందని విశ్వాసం. లయకారుడైన శివుడిని పూజించడం వలన కష్ట, నష్టాలు తొలగిపోతాయని నమ్మకం. సోమవారం శివుడిని ఆరాధించడానికి పవిత్రమైనదిగా భావిస్తారు.  సోమవారం శివారాధన మరింత ప్రయోజనకరమని భక్తుల విశ్వాసం. ఈ రోజున మహాదేవుడిని నిజమైన భక్తితో పూజించే భక్తులు సుఖ సంతోషాలను అన్ని రకాల శుభాలను పొందుతారు. హిందూ మత విశ్వాసం ప్రకారం.. పెళ్లి కాని అమ్మాయిలు లేదా వివాహం కోసం మంచి సంబంధం కోసం చూస్తున్న యువతి యువకులు సోమవారం ఉపవాసం ఉండాలి. ఇలా ఉపవాస దీక్షను చేపట్టడం వలన యువతీ యువకులు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారని నమ్ముతారు.

  1. సోమవారం రోజున శివుడి పూజ కోసం ప్రత్యేక చర్యలు ఉంటాయని.. ఇలా పూజించడం ద్వారా మహాదేవుడు సంతోషిస్తాడని నమ్ముతారు. మీ కోరికలు ఏవైనా నెరవేరకపోతే, సోమవారం రోజున ఉపవాసం ఉండటం, కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల శుభ  ఫలితాలు లభిస్తాయి. సోమవార పూజ చేసే వ్యక్తికి మాత్రమే కాకుండా మొత్తం కుటుంబానికి కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు సోమవారం రోజున శివయ్య పూజ కోసం చేయాల్సిన పూజా విధానం ఏమిటో తెలుసుకుందాం.
  2. మీరు ఏదైనా కోరికను నెరవేరాలని సోమవారం రోజున ఉపవాసం ఉన్నట్లయితే, శివుడి పూజా సమయంలో.. శివుడికి గంగాజలం, బిల్వ పత్రాలు, ఉమ్మెత్త, పాలు మొదలైన వాటిని సమర్పించండి. అంతేకాదు పూజ చేసే సమయంలో ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించండి.
  3. సోమవారం ఆరాధనలో దానం, దక్షిణ కూడా చాలా ముఖ్యమైనవి. ఈ రోజున బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు, బియ్యం దానం చేయండి.  ఇలా చేయడం వల్ల పితృ దోషానికి సంబంధించిన సమస్యలు తీరుతాయి. అంతేకాదు ఇంటిలోని పేదరికం తొలగి.. ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయని.. సానుకూలతను తెస్తుందని కూడా నమ్ముతారు.
  4. గత కొన్ని రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లయితే, సోమవారం పూజ కోసం ఖచ్చితంగా ఈ పరిహారాలు చేయండి. సోమవారం రోజున భక్తులు తెల్లటి చందనంతో రత్నంతో చేసిన శివలింగాన్ని పూజించాలి. ఇలా చేయడం వలన శివయ్యతో  పాటు లక్ష్మీదేవి కూడా ప్రసన్నులవుతారని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
  5. ఇవి కూడా చదవండి
  6. ఎవరి జాతకంలో నైనా ఏదైనా గ్రహదోషం ఉన్నట్లయితే.. ముఖ్యంగా శని దోషం ఉంటే, తప్పకుండా సోమవారంరోజున  మహాదేవుని పూజించండి. ఈ రోజున పూజించడం వల్ల సాధకుల కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. పూజ సమయంలో శివయ్యను జమ్మి ఆకులతో పూజ చేయాలి.
  7. శివపూజలో చందనం, తేనె కలిపి జలాభిషేకం చేసినా సాధకుని కోరికలు నెరవేరుతాయి. అంతే కాకుండా పెళ్లి చేసుకోవాలనుకునే వారికి మంచి సంబంధాలు కూడా వస్తాయి.

 

మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)