Lord Shaniswara: ఎవరికైనా ఈ అలవాట్లు ఉంటే జాగ్రత్త.. శనీశ్వరుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది..

|

Jul 20, 2024 | 7:11 AM

ఎవరి మీదనైనా శనీశ్వరుడికి ఆగ్రహం కలిగితే వారి జీవితం కష్టాలతో నిండిపోతుంది. అందుకే అతనిని సంతోషంగా ఉంచడానికి ప్రజలు తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. అయితే కొన్నిసార్లు తెలిసి లేదా తెలియక చేసే కొన్ని తప్పులు శనీశ్వరుడికి కోపం తెప్పిస్తాయి. కొన్ని రకాల అలవాట్లు వలన శనీశ్వరుడికి కోపం వస్తుంది. అంతేకాదు అటువంటి వ్యక్తి జీవితంలో దుఃఖం, పేదరికం పెరుగుతాయి.

Lord Shaniswara: ఎవరికైనా ఈ అలవాట్లు ఉంటే జాగ్రత్త.. శనీశ్వరుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది..
Lord Shani Dev
Follow us on

శనీశ్వరుడు న్యాయ దేవుడిగా పరిగణించబడుతున్నాడు. అతను మనిషి చేసే కర్మలను బట్టి  తగిన  ఫలితాలను ఇస్తాడు. ఎవరి మీదనైనా శనీశ్వరుడికి ఆగ్రహం కలిగితే వారి జీవితం కష్టాలతో నిండిపోతుంది. అందుకే అతనిని సంతోషంగా ఉంచడానికి ప్రజలు తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. అయితే కొన్నిసార్లు తెలిసి లేదా తెలియక చేసే కొన్ని తప్పులు శనీశ్వరుడికి కోపం తెప్పిస్తాయి. కొన్ని రకాల అలవాట్లు వలన శనీశ్వరుడికి కోపం వస్తుంది. అంతేకాదు అటువంటి వ్యక్తి జీవితంలో దుఃఖం, పేదరికం పెరుగుతాయి.

  1. గోర్లు తినే అలవాటు : మురికి గోర్లు లేదా గోర్లు తినే అలవాటు ఉన్న వ్యక్తులపై శనీశ్వరుడికి ఆగ్రహం కలుగుతుంది. అటువంటి వ్యక్తులను ఎప్పుడూ శనీశ్వరుడు ఆశీర్వాదం ఉండదు. శుభ దృష్టితో చూడడు.
  2. పెద్దలను అవమానించడం: పెద్దలను అవమానించే వ్యక్తులపై శనీశ్వరుడు మాత్రమే కాదు దేవీ దేవతలందరూ కోపంగా ఉంటారు. పెద్దలను అవమానించే వ్యక్తులపై శనిదేవుడు క్రూరమైన దృష్టిని కలిగి ఉంటాడని నమ్ముతారు. అలాంటి వ్యక్తులు జీవితాంతం బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. వారు ఎల్లప్పుడూ మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతూ ఉంటారు.
  3. వంటగదిని మురికిగా ఉంచడం: ఇంట్లో వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకుండా మురికిగా ఉంచే అలవాటు ఉంటే .. అలాంటి వారు వెంటనే అలవాటు మార్చుకోవాలి. ఈ అలవాటు ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపడమే కాదు శనీశ్వరుడి  అనుగ్రహాన్ని కూడా కోల్పోతారు.
  4. కాళ్ళను ఈడుస్తూ నడవడం : కొంతమంది నడిచేటప్పుడు బూట్లు, చెప్పులు ఈడ్చుకుంటూ వెళ్తారు. ఈ అలవాటు వల్ల శనీశ్వరుడికి చాలా కోపం వస్తుంది. దీని కారణంగా ఆర్థిక పరిస్థితి క్షీణించడం ప్రారంభమవుతుంది. చేస్తున్న పని కూడా చెడిపోతుంది. అంతేకాదు ఈ అలవాటు అప్పుల భారాన్ని కూడా పెంచుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. కూర్చుని కాళ్లు ఊపుతూ ఉంటే : కొంతమంది కూర్చున్న చోట కాళ్లు ఊపుతూ ఉంటారు. లేదా కొంతమంది కాలు మీద కాలు వేసి కాళ్లను  కదుపుతూ ఉంటారు. హిందూ మతంలో ఇటువంటి అలవాట్లు చాలా అశుభమైనవిగా పరిగణించబడతాయి .  ఈ అలవాటు శనిదేవునికి కోపం తెప్పిస్తుంది. ఇలాంటి అలవాట్ల వల్ల మీ కుటుంబ జీవితంలో టెన్షన్ పెరుగుతుంది.
  7. అప్పు తీసుకుని ఎగ్గొట్టే వ్యక్తులపై : అవసరమైనప్పుడు ఎవరైనా సహాయం తీసుకోవడం తప్పు కాదు. అయితే ఆ అప్పు తిరిగి ఇవ్వకపోవడం ఒక చెడు అలవాటు. డబ్బు అప్పుగా తీసుకుని ఉద్దేశపూర్వకంగా డబ్బు తిరిగి ఇవ్వని వ్యక్తులు శనీశ్వరుడి చెడు దృష్టిని ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల వీలైనంత త్వరగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు