AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Lalla: వజ్రాలు, రత్నాలు పొదగబడిన బాల రామచంద్రుడి ఆభరణాలు మొత్తం ఎన్ని కోట్ల రూపాయలంటే

బాల రాముడు విగ్రహాన్ని అద్భుతమైన ఆభరణాలతో అలంకరించారు. నల్లని రామయ్య బంగారు నగలతో ముగ్ద మనోహర రూపంలో కనిపించాడు. రామయ్యకు అలంకరించిన ఆభరణాలను దాదాపు 132 మంది కళాకారులు రెడీ చేశారు. దీని కోసం అవిశ్రాంతంగా శ్రమించారు. నుదిటి తిలకంగా బంగారు నామం, పచ్చల ఉంగరాలు, కంఠాభరణాలు, కిరీటం, కంకణాలు ఇలా సర్వాలంకార భూషితుడై భక్తులకు తన మొదటి దర్శనాన్ని ఇచ్చాడు.

Ram Lalla: వజ్రాలు, రత్నాలు పొదగబడిన బాల రామచంద్రుడి ఆభరణాలు మొత్తం ఎన్ని కోట్ల రూపాయలంటే
Ram Lalla Idol
Surya Kala
|

Updated on: Jan 23, 2024 | 9:47 AM

Share

500 ఏళ్ల హిందువుల కల సోమవారం సాకారం అయింది. తన జన్మ భూమి అయోధ్యలో రామయ్య కొలువు దీరాడు. అంగ రంగ వైభంగా బాల రాముడు మందిరంలోని గర్భ గుడిలో గృహ ప్రవేశం చేశాడు. ప్రధాని మోడీ చేతుల మీదుగా బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యకమం జరిగింది. శ్రీ రామ చంద్రుడు ఐదేళ్ళ బాలుడుగా విల్లు, ధనుస్సు చేత బట్టి చిరునవ్వుతో బంగారు నగలతో దర్శనం ఇస్తున్న ముగ్ద మనోహర రూపం చూపరులకు ముద్దుగోలుపుతోంది.

బాల రాముడు బంగారునగలను ధరించి భక్తుల చూపులను పక్కకు తిప్పుకోనివ్వకుండా చేశాడు. ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్‌‌స్టిట్యూట్ ( IGI) సర్టిఫికేషన్​ పొందిన ఉత్తర్ ప్రదేశ్ లక్నోలోని ఉన్న హర్షహైమల్ షియామ్‌లాల్ జ్యువెలర్స్ సంస్థ ఈ అందమైన అద్భుతమైన నగలను రూపొందించింది . ఈ ఆభరణాల తయారీకి తాము హిందూ గ్రంథాలతో పాటు టీవీ షో ‘రామాయణ్’ నుండి ప్రేరణ పొందామని చెప్పారు CEO అంకుర్ ఆనంద్,.

బాల రాముడు విగ్రహాన్ని అద్భుతమైన ఆభరణాలతో అలంకరించారు. నల్లని రామయ్య బంగారు నగలతో ముగ్ద మనోహర రూపంలో కనిపించాడు. రామయ్యకు అలంకరించిన ఆభరణాలను దాదాపు 132 మంది కళాకారులు రెడీ చేశారు. దీని కోసం అవిశ్రాంతంగా శ్రమించారు. నుదిటి తిలకంగా బంగారు నామం, పచ్చల ఉంగరాలు, కంఠాభరణాలు, కిరీటం, కంకణాలు ఇలా సర్వాలంకార భూషితుడై భక్తులకు తన మొదటి దర్శనాన్ని ఇచ్చాడు. బాల రామయ్యకు అలంకరించిన ఈ నగలలో 18,567 వజ్రాలు, 2,984 కెంపులు, 615 పచ్చలు, 439 అన్‌కట్ వజ్రాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కిరీటం (ముకుటం): బాల రామయ్య వజ్రాలు, పచ్చలు , కెంపులతో పొదగబడిన కిరీటాన్ని ధరించాడు. దీని బరువు సుమారు 1.7 కిలోలు ఉంటుంది. దాదాపు 75 క్యారెట్ల వజ్రాలు, 135 క్యారెట్ల జాంబియన్ పచ్చలు, 262 క్యారెట్ల కెంపులతో పాటు ఇతర రత్నాల కూడా ఉన్నాయి.

కిరీటం రామయ్య అత్యంత అందమైన అలంకారంకి ఒకటి. మధ్యలో శ్రీ రామ్ లల్లా వంశాన్ని సూచించే సూర్యవంశ లోగో. రాచరికానికి సంకేతం అయిన మన జాతీయ పక్షి అయిన నెమలి కూడా ఉన్నాయి. పచ్చ జ్ఞానాన్ని సూచిస్తుంది. కెంపులు సూర్య (సూర్య దేవుడు) రాళ్ళు. వజ్రాలు స్వచ్ఛత, నిజాయితీని సూచిస్తాయి” అని ఆనంద్ వివరించారు.

తిలకం: ఆధ్యాత్మికతకు, భక్తుల ను రక్షించే రక్షిత చిహ్నంగా నుదిట తిలకాన్ని భావిస్తారు ఇది సుమారు సుమారు16 గ్రాముల బంగారంతో తయారు చేశారు. 3 క్యారెట్ సహజ వజ్రం, దాని చుట్టూ దాదాపు 10 క్యారెట్లు ఉండే చిన్న వజ్రాలు, బర్మీస్ కెంపులున్నాయి. ఉదయం మొదటి సూర్యకిరణం ఈ తిలకంపై పడే విధంగా రత్నాలను వినియోగించినట్లు ఆనంద్ చెప్పారు

చేతికి ఉంగరం: రామ చంద్రుడు కుడి చేతికి ధరించిన ఉంగరం 65 గ్రాములు ఉంటుంది. దీనిలో 4 క్యారెట్ల వజ్రాలు, 33 క్యారెట్ల పచ్చలు ఉంటాయి. ఇక ఎడమ చేతి కోసం 26 గ్రాముల రూబీ రింగ్ లో వజ్రాలు, కెంపులు ఉన్నాయి.

కంఠాభరణాలు: బంగారంతో చేసిన గుండ్రని నెక్లెస్ 500 గ్రాముల బరువు ఉంటుంది, 50 క్యారెట్ల వజ్రాలు, 150 క్యారెట్ల కెంపులు, 380 క్యారెట్ల పచ్చలు పొదిగారు.

నడుము పట్టీ: బాల రామయ్య నడుమ పట్టీ సుమారు 750 గ్రాముల బరువైన బంగారంతో తయారు చేశారు. ఈ పట్టీలో 70-క్యారెట్ల వజ్రాలు, 850 క్యారెట్ల కెంపులు, పచ్చలను పొదిగారు.

చేతి కడియాలు: చేతి కడియాలను 850 గ్రాముల బంగారంతో తయారు చేశారు. 100 క్యారెట్ల వజ్రాలు, 320 క్యారెట్ల కెంపులు, పచ్చలను ఈ కంకణాల్లో పొదిగారు. అంతేకాదు ఒక్కో కడియం బరువు 400 గ్రాములకు పైగానే ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..