AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొప్పాయిలో ప్రత్యక్షమైన గణేశుడు.. గణపతి పండుగ వేళ రైతు కుటుంబంలో పట్టలేని ఆనందం!

Ganesha shape in papaya: గణపతి పండుగ వేళ కర్ణాటకలోని విజయనగర జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రైతు తోటలోని పప్పాయి పండులో గణేశుడి రూపాన్ని పోలిన ఆకృతి కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. భక్తితో ఆ పప్పాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బొప్పాయిలో ప్రత్యక్షమైన గణేశుడు.. గణపతి పండుగ వేళ రైతు కుటుంబంలో పట్టలేని ఆనందం!
Ganesha Shape In Papaya
Rajashekher G
|

Updated on: Sep 17, 2026 | 2:53 PM

Share

Ganesha shape in papaya Telugu: దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చాలా మండపాల్లో 9 రోజులపాటు గణనాథుడు పూజలందుకోనుండగా.. మరికొన్ని మండపాలు, ఇళ్లల్లోని వినాయకుల నిమజ్జన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ గణపతి నవరాత్రుల వేళ కర్ణాటకలోని విజయనగర జిల్లాలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. కూడ్లిగి (Kudligi) తాలూకా కానామడుగు గ్రామానికి చెందిన ఓ రైతు తోటలో పండిన బొప్పాయి పండులో గణేశుడి ఆకారం కనిపించడం కుటుంబ సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. గణపతి పండుగ సమయంలోనే ఇలా గణేశాకృతి కనిపించడంతో వారు దీనిని భక్తితో గణేశుడి ఆశీర్వాదంగా స్వీకరించారు.

కానామడుగు గ్రామానికి చెందిన రైతు బసవరాజ్ పాల్తూర్ తన తోటలో పండిన బొప్పాయిని కోసుకుని ఇంటికి తీసుకొచ్చారు. తన సోదరుడికి ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఆ పండును చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. బొప్పాయి ఆకారంలో గణేశుడి రూపాన్ని పోలిన ఆకృతి కనిపించింది. గణపతి ఉత్సవాల సమయంలోనే ఈ ఆకృతి కనిపించడంతో కుటుంబ సభ్యులు దీనిని శుభసూచకంగా భావించారు. బొప్పాయిలో గణేశుడి రూపం కనిపించడాన్ని వినాయకుడి అనుగ్రహంగా భావించి, ఆ పండును భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా పూజించారు. సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి గణపతిని కొలిచారు.

ఈ ఘటనతో బసవరాజ్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. చాలా సంవత్సరాల తర్వాత తమ కుటుంబంలో మళ్లీ గణేశోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు భావించారు. గణపతి పండుగ రోజుల్లో బొప్పాయిలో వినాయకుడి రూపాన్ని పోలిన ఆకృతి కనిపించడం తమకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

హిందూ సంప్రదాయాల్లో గణేశుడిని విఘ్నేశ్వరుడు, శుభకార్యాలకు ఆది దేవుడుగా భక్తులు భావిస్తారు. అందుకే గణపతి పండుగ సమయంలో ప్రకృతిలో కనిపించే కొన్ని ప్రత్యేక ఆకృతులను భక్తులు దైవసంకేతాలుగా భావించడం సాధారణం. అయితే ఇటువంటి సహజ ఆకృతులకు శాస్త్రీయ కారణాలు కూడా ఉండవచ్చు. అయినప్పటికీ భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మిక భావనల నేపథ్యంలో ఈ ఘటన ప్రత్యేకంగా ఆసక్తిని కలిగిస్తోంది.

Follow Us