Vontimitta Ramalayam: తెరుచుకున్న ఒంటిమిట్ట రామాలయం.. స్వామి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు..

|

Jun 17, 2021 | 8:49 AM

Vontimitta Ramalayam: కరోనా వ్యాప్తి కారణంగా మూత పడిన కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయం ద్వారాలు రెండు నెలల అనంతరం...

Vontimitta Ramalayam: తెరుచుకున్న ఒంటిమిట్ట రామాలయం.. స్వామి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు..
Vontimitta Ramalayam
Follow us on

Vontimitta Ramalayam: కరోనా వ్యాప్తి కారణంగా మూత పడిన కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయం ద్వారాలు రెండు నెలల అనంతరం తెరుచుకున్నాయి. బుధవారం నాడు ఆలయ అధికారులు స్వామి వారి ఆలయాన్ని తెరిచారు. తాజాగా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో అధికారులు.. భక్తులకు ఆలయ ప్రవేశానికి అనుమతించారు. దాంతో గురువారం నాడు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. వేకువజామున సుప్రభాత సేవ అనంతరం ఉదయం 6 గంటలకు దర్శననానికి భక్తులకు అనుమతించారు. కరోనా నిబంధనల నడుమ భక్తులు స్వామివారిని దర్శించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

అయితే, కరోనా కారణంగా తీర్థప్రసాదాల వితరణను నిలిపివేశారు. అలాగే.. రాష్ట్రంలో ప్రస్తుతం కర్ఫ్యూ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈనెల 20వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రం భక్తులకు ఆలయ ప్రవేశానికి అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. 20వ తేదీ తరువాత ప్రభుత్వ నిర్ణయానుసారం తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఈ ఆలయంలో రెండు నెలలుగా భక్తుల ప్రవేశాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో ఆలయాన్ని పునఃప్రారంభించారు.

Also read:

Contract Nurse: మాకూ వారిలాగే ఇవ్వండి.. కాంట్రాక్ట్ నర్సుల డిమాండ్.. ఈ నెల 28న సమ్మె..