Kurma Jayanti 2024: కూర్మ జయంతి రోజున విష్ణు పూజకు శుభ సమయం, పూజా విధానం మీ కోసం

| Edited By: Janardhan Veluru

Jun 10, 2024 | 1:39 PM

పురాణాల ప్రకారం విష్ణువుకి సంబంధించిన కూర్మ అవతారానికి చెందిన అంశాలను వివిధ పురాణాలలో ప్రస్తావించారు. లింగ పురాణం ప్రకారం భూమి పాతాళంలోకి వెళుతున్నప్పుడు శ్రీ మహా విష్ణువు తాబేలు రూపంలో అవతరించి భూమి రక్షించాడు. సముద్ర మథనం సమయంలో మందర పర్వతం మునిగిపోవడం ప్రారంభించినప్పుడు.. శ్రీ మహా విష్ణువు కూర్మ రూపాన్ని ధరించి తన వీపుపై నిలుపాడని పద్మ పురాణంలో చెప్పబడింది.

Kurma Jayanti 2024: కూర్మ జయంతి రోజున విష్ణు పూజకు శుభ సమయం, పూజా విధానం మీ కోసం
Kurma Avatar 2024
Follow us on

హిందూమతంలో కూర్మ జయంతి పండుగను వైశాఖ పూర్ణిమ రోజున చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున విష్ణువు అవతారమైన కుర్మాన్ని అంటే తాబేలు అవతారాన్ని పూజిస్తారు. కూర్మ జయంతి రోజున విష్ణుమూర్తిని పూర్ణ క్రతువులతో పూజించడం ద్వారా ప్రజల కోరికలన్నీ నెరవేరుతాయని, ఈ రోజున పూర్వీకులకు కూడా మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఈ ఏడాది కూర్మ జయంతి 23 మే 2024 గురువారం రోజున జరుపుకోనున్నారు. ఈ రోజు శ్రీ మహా విష్ణువుకి సంబంధించిన రోజుగా పరిగణించబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పండుగ ప్రాధాన్యత మరింత పెరిగింది. కూర్మ జయంతి రోజు సాయంత్రం శ్రీ హరిని పూజిస్తారు.

పురాణాల ప్రకారం విష్ణువుకి సంబంధించిన కూర్మ అవతారానికి చెందిన అంశాలను వివిధ పురాణాలలో ప్రస్తావించారు. లింగ పురాణం ప్రకారం భూమి పాతాళంలోకి వెళుతున్నప్పుడు శ్రీ మహా విష్ణువు తాబేలు రూపంలో అవతరించి భూమి రక్షించాడు. సముద్ర మథనం సమయంలో మందర పర్వతం మునిగిపోవడం ప్రారంభించినప్పుడు.. శ్రీ మహా విష్ణువు కూర్మ రూపాన్ని ధరించి తన వీపుపై నిలుపాడని పద్మ పురాణంలో చెప్పబడింది.

కూర్మ జయంతి శుభ సమయం

పంచాంగం ప్రకారం వైశాఖ పౌర్ణమి తేదీ 22 మే 2024న సాయంత్రం 06:47 గంటలకు ప్రారంభమై 23 మే 2024 రాత్రి 07:22 గంటలకు ముగుస్తుంది. కూర్మ జయంతి ఆరాధనకు మే 23న సాయంత్రం 04.25 నుంచి 07.10 గంటల వరకు అనుకూల సమయం. విష్ణువును ఆరాధించడానికి ప్రజలకు 2 గంటల 45 నిమిషాల సమయం లభిస్తుంది. ఉదయ తిథి ప్రకారం కూర్మ జయంతిని జరుపుకోవాలంటే మే 23వ తేదీ గురువారం జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

కూర్మ జయంతి పూజా విధానం

  1. కూర్మ జయంతి రోజు సాయంత్రం ఒక శుభ ముహూర్తంలో రాగి కలశంలో నీరు, పాలు, నువ్వులు, బెల్లం, పూలు, బియ్యం కలిపి ఇంటికి తూర్పు దిక్కున కలశం ప్రతిష్టించాలి.
  2. అనంతరం కూర్మావతారాన్ని పూజను దీపం వెలిగించి ప్రారంభించండి. పసుపు, కుంకుమ, ఎరుపు పువ్వులు సమర్పించండి.
  3. తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. కనుక ఈ రోజున విష్ణుమూర్తికి తులసి దళాలను సమర్పించండి.
  4. శ్రీ మహా విష్ణువు సాత్విక ఆహారాన్ని సమర్పించండి. వీలైతే ప్రసాదంలో ఏదైనా తీపి పదార్ధాలను చేర్చండి.
  5. నైవేద్యంగా ఆహారాన్ని సమర్పించిన అనంతరం జపమాలతో విష్ణువుకి సంబంధించిన మంత్రాన్ని జపించండి. పూజా మంత్రం: ఓం ఆం శ్రీం హ్రీం కం కూర్మాయ నమః.

కూర్మ జయంతి రోజున ఈ చర్యలు చేయండి

  1. కూర్మ జయంతి రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ రోజున ఆచారాల ప్రకారం శ్రీ మహా విష్ణువును పూజించండి.
  2. విష్ణువును పూజించడంతో పాటు లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం కూడా ఉంది.
  3. తులసిని సమర్పించడం ద్వారా శ్రీ మహా విష్ణువు త్వరగా ప్రసన్నుడవుతాడు. అన్ని కోరికలను తీరుస్తాడని నమ్మకం.
  4. గురువారం రోజున పసుపు వస్తువులను దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున దానం చేయడం వల్ల అనేక ఫలితాలు వస్తాయి.
  5. శ్రీ మహా విష్ణువుకి హారతిని ఇవ్వాలి. ఇలా నియమ నిష్టలతో పూజ చేసిన ఇంట్లో విష్ణువు ఆశీర్వాదం, ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని విశ్వాసం.
  6. భూమిపై పాపం పెరిగినప్పుడు.. దేవుడు భూమి మీద శ్రీ మహా విష్ణువు అవతరిస్తాడని భగవద్గీతలో పేర్కొనబడింది.

కూర్మ అవతారానికి సంబంధించిన కథ

త్రిమూర్తుల్లో శ్రీ మహా విష్ణువు పోషకుడు. కూర్మావతారం విష్ణువు రెండవ అవతారంగా నరసింహ పురాణంలో పేర్కొనబడింది. భగవత్ పురాణం ప్రకారం విష్ణువు పదకొండవ అవతారం. పురాణాల ప్రకారం దుర్వాస మహర్షి ఇంద్రునిపై కోపం తెచ్చుకున్నాడు. అప్పుడు దేవతలను మనుష్యులుగా మారమని శపించాడు. దీంతో దేవతలు తమ తమ లోకాలను విడిచి వివిధ రూపాల్లో వివిధ ప్రాంతాలకు చేరుకున్నారు. లక్ష్మిదేవి సముద్రంలో అదృశ్యమైంది. అప్పుడు శ్రీ విష్ణువు ఆజ్ఞపై, ఇంద్రుడు రాక్షసులు, దేవతలతో కలిసి సముద్ర మథనం చేయడానికి అంగీకరించాడు.

సముద్రాన్ని మథనం చేసేందుకు మందర పర్వతాన్ని కవ్వంగా, నాగరాజు వాసుకిని తాడుగా మార్చారు.. సముద్రాన్ని అమృతం కోసం చిలకడం మొదలు పెట్టారు. అయితే మందర పర్వతం కింద ఆధారం లేకపోవడంతో అది సముద్రంలో మునిగిపోవడం మొదలు అయింది. అప్పుడు దేవతల ప్రార్ధనతో విష్ణువు భారీ కూర్మ (తాబేలు) రూపంలో అవతరించి సముద్రంలోకి చేరి మందర పర్వతం మునుగి పోకుండా నిలిపాడు. ఇలా కూర్మావతారం దాల్చిన రోజు వైశాఖ మాసం పౌర్ణమి. అప్పటి నుంచి కూర్మ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు