హిందూ మతంలో జన్మాష్టమి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జన్మాష్టమి పండుగను శ్రీకృష్ణుని జన్మదినోత్సవంగా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమి తిథి రోహిణి నక్షత్ర సమయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. జన్మాష్టమి రోజున లడ్డూ గోపాలుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. జన్మాష్టమి రోజున బాల గోపాలుడి రూపాన్ని పూజించడం ఫల ప్రదం అని నమ్ముతారు. మీ ఇంట్లో లడ్డూ గోపాల్ ఉంటే.. జన్మాష్టమి రోజున ఉపవాసం ఉంటే, కొన్ని నియమాలు పాటించాలి. తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల కన్నయ్యకు కోపం వస్తుంది.
శ్రీ కృష్ణ భగవానుని భక్తులు తరచుగా తమ ఇళ్లలో బాల రూపంలో ఉన్న కృష్ణుడిని అంటే లడ్డూ గోపాలుడిని ఉంచి సేవిస్తారు. తమ కుటుంబంలో ముఖ్యమైన సభ్యుడులా భావిస్తారు. అయితే కన్నయ్యకు సంబంధించిన పూజ, ఆహారం, నిద్ర మొదలైన మొత్తం దినచర్యకు సంబంధించిన ఏర్పాట్లు చాలా ప్రత్యేకమైనవి. ఇలాంటి పరిస్థితుల్లో జన్మాష్టమి రోజున లడ్డూ గోపాలుడి పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఆ రోజున తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు మీ జీవితంలో కష్టాలను పెంచుతాయి.
జన్మాష్టమి శుభ సందర్భంగా పొరపాటున కూడా ఇంట్లో తామసిక ఆహారాన్ని వండకూడదు. అలాగే అలాంటి ఆహారాన్ని తినకూడదు. దీనితో పాటు జన్మాష్టమి రోజున ఇంట్లో అన్నం వండకూడదు. తినకూడదు. ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడికి కోపం వస్తుందని నమ్ముతారు.
జన్మాష్టమి రోజున పొరపాటున కూడా నల్లని వస్త్రాలు ధరించావద్దు. అలాగే శ్రీకృష్ణుడిని నల్లని వస్త్రాలతో అలంకరించకూడదు. ఇలా చేయడం ద్వారా కృష్ణుని అనుగ్రహాన్ని పొందలేరు. ఇది మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
హిందూ మతపరమైన కార్యక్రమాలలో తులసి ఆకులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి దళాల్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అందుకే జన్మాష్టమి రోజున పొరపాటున కూడా తులసి దళాలను మొక్క నుంచి తీయకూడదు. ఎందుకంటే శ్రీ కృష్ణుడు విష్ణువు అవతారం. ఈ రోజున తులసి ఆకును తీయడం వల్ల పూజ పరిపూర్ణం కాదని నమ్ముతారు. అయితే చరణామృతంలో తులసిని చేర్చాలనుకుంటే ఒక రోజు ముందుగానే చెట్టు నుంచి తీసి పెట్టుకోవాలి.
లడ్డూ గోపాలుడికి ఆవు, దూడ అంటే చాలా ఇష్టమని చెబుతారు. కావున జన్మాష్టమి రోజున ఇంట్లోని మొదటి ఆహారాన్ని ఆవు, దూడలకు తినిపించండి. ఇంటి దగ్గరకు వచ్చిన ఏ ఆవును లేదా దూడను తరిమికొట్టవద్దు. వాటిని హింసించవద్దు. ఆకలితో వెళ్ళనివ్వ వద్దు.
శ్రీకృష్ణునికి 56 రకాల ఆహారపదార్థాలు కృష్ణాష్టమి రోజున సమర్పిస్తారు. అందువల్ల చాలా మంది ఈ భోగ్ సంఖ్యను పెంచడానికి అనేక రకాల నమ్కీన్, అప్పడాలు, బిస్కెట్లు వంటి వాటిని కూడా నైవేద్యం సమర్పించే వస్తువుల్లో చేర్చుతారు. అయితే ఈ మూడు ఆహార పదార్ధాలను కన్నయ్యకు అందించవచ్చు. అయితే దీనికి ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మీరు సమర్పించే నమ్కీన్, పాపడ్ వంటి వాటిలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఉండకూడదు. ఈ రోజుల్లో అనేక బిస్కెట్లు , కుకీల తయారీలో గుడ్డు చేరుస్తున్నారు. అందువల్ల వీటిని కన్నయ్యకు సంపరిమ్చే నైవేద్యంలో చేర్చే ముందు, ఈ పదార్థాలను జాగ్రత్తగా తనిఖీ చేయాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండ్
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు