Joshimath Crisis: జోషిమఠం దుస్థికి ఆ పూజ సంప్రదాయాల ఉల్లంఘనే కారణమా..? తెరమీదకు కొత్త వివాదం

పూరీ పీఠాధీశ్వరుడు శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి స్పందిస్తూ.. సంచలన ఆరోపణలు చేశారు..  ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన స్థలం ప్రదేశం ప్రస్తుతం వినోదాన్ని అందించే పర్యాటక కేంద్రంగా మార్చారు.. ఆధ్యాత్మక ప్రదేశాన్ని వినోదకి కేంద్రంగా చేసి.. దైవ శక్తులను ఇబ్బంది పెట్టకూడని అన్నారు.

Joshimath Crisis: జోషిమఠం దుస్థికి ఆ పూజ సంప్రదాయాల ఉల్లంఘనే కారణమా..? తెరమీదకు కొత్త వివాదం
Joshimath Crisis

Updated on: Jan 12, 2023 | 2:10 PM

హిందూమతంతో ముడిపడి ఉన్న నాలుగు ప్రధాన ధాముల్లో ఒకటైన బద్రీనాథ్ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ప్రతి హిందువు తన జీవితంలో ఒకసారైనా దర్శించాలనుకునే పవిత్ర క్షేత్రం. బద్రినాథుడు గా పూజలను అందుకుంటున్న శ్రీ విష్ణువు పవిత్ర నివాసంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ మార్పు కొన్నిసార్లు పరిస్థితుల కారణంగా .. మరి కొన్నిసార్లు ప్రకృతి కారణంగా సంభవిస్తుంది. ఉదాహరణకు.. ప్రతి సంవత్సరం శీతాకాలం సమయంలో బద్రీనాథ్ తలుపులు మూసివేస్తారు.. జోషిమఠంలో సాంప్రదాయాలను అనుసరిస్తూ పూజిస్తారు. ఇప్పుడు స్థలంలోనే కాదు ఆయనను పూజించే పూజారుల్లో కూడా మార్పు కనిపిస్తోంది. వాస్తవానికి కేరళలోని రావల్ పూజారులకు మాత్రమే బద్రీనాథ్ ధామ్‌లో పూజలు చేసే హక్కు ఉంది. శీతాకాలంలో బద్రీనాథ్ తలుపులు మూసివేసి.. స్వామివారిని బద్రి విశాల్ డోలీ జోషి మఠానికి చేరుస్తారు. ఇక్కడ ఆరు నెలల పాటు రావల్ పూజారులను భర్తీ చేస్తూ..  సరోలా బ్రహ్మచారులు పూజిస్తారు. ఈ సమయంలో, రావల్ పూజారి దక్షిణ భారతదేశానికి వెళ్తాడు.

జ్యోతిర్మఠానికి చెందిన 46వ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ప్రకారం.. బద్రీనాథ్ స్వామిని పూజించే సంప్రదాయంలో ఈ మార్పు ఇప్పటి కాదు. ఈ పవిత్ర స్థలంలో శంకరాచార్యులు స్వయంగా పూజలు చేసేవారు. అయితే ఒక సందర్భంలో పూజ చేసే బాధ్యత రావల్ పూజారులకు అప్పగించారు. ఆరు నెలల తర్వాత ఆ బాధ్యతలను స్థానిక సరోలా పూజారులు బాధ్యతలు స్వీకరిస్తారు.

బద్రీనాథ్ ధామ్ ఆరాధన సంప్రదాయంలో మార్పును జోషిమఠ విపత్తుకు కారణమని భావిస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడో ఒకచోట దేవుడి పూజకు అంతరాయం కలుగుతుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

సరోలా పూజారి ఎవరంటే.. జోషిమఠంలోని బద్రీనాథ్‌ను పూజించే సరోలా పూజారులు పర్వత శ్రేణుల్లో జీవించే వారిలో ఉన్నత బ్రాహ్మణులలో లెక్కించారు. బద్రీనాథ్ స్వామిని పూజాదికార్యక్రమాలు వారిని దక్కడానికి కారణం ఇదే అని అంటారు.

ఆదిశంకరాచార్య దక్షిణ భారతదేశం నుండి ఈ పూజారులను తీసుకువచ్చి జోషిమఠానికి సమీపంలోని డిమ్మర్ గ్రామంలో స్థిరపరిచారని నమ్ముతారు. డిమ్రీ గ్రామంలో నివసించడం వల్ల  ఈ సరోలా పూజారులను డిమ్రీ కమ్యూనిటీ అని కూడా పిలుస్తారు. సరోలా బ్రాహ్మణులను నంబూద్రి అంటే కేరళలోని రావల్ పూజారులకు మిత్రులుగా పరిగణిస్తారు. ఆరునెలల తర్వాత బద్రీనాథ్  తలుపులు తెరిచే సమయంలో .. అనివార్య కారణాల వల్ల రావల్ పూజారులు బద్రీనాథ్ చేరుకోకపోతే.. సరోల బ్రాహ్మణులు వారి స్థానంలో బద్రీనాథ్ స్వామిని పూజిస్తారు.

రావల్ పూజారులకు పూజా హక్కు ఎవరు ఇచ్చారంటే.. బద్రీనాథ్ ఆలయంలో పూజలు చేసే పూజారులను రావల్స్ అని పిలుస్తారు. జోషిమఠంలో నివసించే స్థానిక ప్రజలు బద్రీనాథ్‌ను పూజించడానికి రావల్ పూజారులు శంకరాచార్యులచే అధికారం పొందారని నమ్ముతారు. అయితే శైవ సంప్రదాయానికి చెందిన ప్రజలు మాత్రం ఇది వాస్తవం కాదని అంటారు.

శ్రీ బద్రీ విశాల్ స్వామిని బద్రీనాథ్ ను పూజించేవారు. ఈ సంప్రదాయం 1776 వరకు కొనసాగింది. అయితే అదే సంవత్సరంలో, శంకరాచార్యులు శివైక్యం చెందిన తర్వాత.. అతని వారసుడు దూరం కారణంగా బద్రీనాథ్ కు సకాలంలో చేరుకోలేదు.  దీంతో టెహ్రీ రాజు తన దగ్గర ఉన్న పూజారిలో ఒకరైన బ్రహ్మచారి గోపాల్ నంబూద్రిని నియమించాడు. 1776 నుండి, రావల్ పూజారులు బద్రీనాథుడిని పూజించే సంప్రదాయం మొదలై ఇప్పటి వరకు కొనసాగుతోందని అంటారు.

కొనసాగని సంప్రదాయం:
ప్రకృతి బీభత్సంతో సతమతమవుతున్న జోషిమఠ వాసులు బద్రీనాథ స్వామిని పూజించే విధానంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయని.. ఈ దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని నమ్ముతారు. బద్రినాథుడి పూజ కోసం అర్చకులను మార్చే ప్రక్రియలో, ఖచ్చితంగా ఎక్కడో కొంత అలసత్వం ఉందని.. అందుకనే ఇప్పుడు ఇంత విపత్తు ఏర్పడిందని ప్రజలు నమ్మకం.

ఇదే విషయంపై పూరీ పీఠాధీశ్వరుడు శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి స్పందిస్తూ.. సంచలన ఆరోపణలు చేశారు..  ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన స్థలం ప్రదేశం ప్రస్తుతం వినోదాన్ని అందించే పర్యాటక కేంద్రంగా మార్చారు.. ఆధ్యాత్మక ప్రదేశాన్ని వినోదకి కేంద్రంగా చేసి.. దైవ శక్తులను ఇబ్బంది పెట్టకూడని అన్నారు. అభివృద్ధి పేరుతో చేస్తోన్న పనుల వలనే ఇక్కడ  సమస్య ఎదురవుతుందన్నారు. మత పెద్దల నిర్లక్ష్యమే ఈ విపత్తుకు కారణమని శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి ఆరోపించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..