Astrology: మంచి శకునాలు-చెడు శకునాలు.. మీ జీవితంపై వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది.?

|

Aug 02, 2021 | 7:17 AM

కొంతమంది ఏదైనా శుభకార్యం చేయలనుకున్నా.. లేదా మంచి పనికి శ్రీకారం చుట్టినా తిధి, వారం, నక్షత్రం లాంటివి క్షుణ్ణంగా చూసి ముందుకు...

Astrology: మంచి శకునాలు-చెడు శకునాలు.. మీ జీవితంపై వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది.?
Good And Bad Signs
Follow us on

కొంతమంది ఏదైనా శుభకార్యం చేయలనుకున్నా.. లేదా మంచి పనికి శ్రీకారం చుట్టినా తిధి, వారం, నక్షత్రం లాంటివి క్షుణ్ణంగా చూసి ముందుకు అడుగు వేస్తారు. ఒకవేళ ఇది కాకపోతే శకునాలు, సంకేతాలు సహాయం తీసుకుంటారు. మంచి శకునాలు, చెడు శకునాలు రెండూ ఉన్నాయి. మంచి శకునం ఎదురైతే.. మీరు తలపెట్టిన పని ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుంది. అదే చెడు శకునం ఎదురైతే.. అంతా గందరగోళంగా ఉంటుంది. మరి ఏది మంచి శకునం.. ఏది చెడు శకునం అనేది కొన్ని సంకేతాల ద్వారా తెలుస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మంచి శకునాలు:

మీరు బయటికి వెళ్లేటప్పుడు.. ఆవు లేదా పిల్లాడిని ఒడిలో పెట్టుకున్న మహిళ లేదా వృద్దుడి మృతదేహం కనిపిస్తే.. శుభం జరగడమే కాకుండా, మీ ప్రయాణం ప్రయోజనకరనది అని అర్ధం.

పిల్లి ఇంట్లో ప్రసవిస్తే, అది సంపదకు సూచిక అని నమ్ముతారు .

అల్పాహారం వేళ కాకి అరుపు వినపడితే.. ఇంటికి చుట్టాలు వస్తారనడానికి సూచిక.

మీ ఇంట్లో ఒక పక్షి వెండి లేదా నగలను జారవిడిస్తే, అది లక్ష్మీ కటాక్షానికి సూచిక.

ఆవు ప్రధాన ద్వారం వద్ద ఉంటే.. అది అదృష్టానికి సూచిక.

కోకిల ఇంట్లో శ్రావ్యమైన శబ్దం చేస్తే, ఆ ఇంటి యజమాని అదృష్టవంతుడు అవుతాడని నమ్ముతారు.

ఇంటి ఎడమ వైపున గాడిద శబ్దం చేస్తే.. వ్యాపారంలో వృద్ధి జరుగుతుందని సంకేతం.

ఈ సంకేతాలు చెడు శకునాలను సూచిస్తాయి..

మీ ఇంటి ప్రధాన ద్వారం నుంచి పాము లోపలికి ప్రవేశిస్తే.. దానిని చెడ్డ శకునంగా పరిగణించాలి.

అర్ధరాత్రి వేళ స్త్రీ ఏడుపు వినిపిస్తే అది చెడ్డ శకునం.

ఆవు తల ఎక్కువగా వణుకుటుంతే ఏదోక కీడుకు సంకేతం.

ఇంట్లో పిల్లి ఏడుపు వినిపిస్తే అది దురదృష్టకరం.

ప్రధాన ద్వారం వద్ద బల్లుల నిరంతర కదలికలు జీవితంలో అడ్డంకులు, వివాదాలను తెచ్చిపెడతాయి.

ఊసరవెల్లి లేదా బల్లి శరీరంపై పడితే శుభ, అశుభ శకునాలకు సంకేతాలు. ఉదాహరణకు, బల్లి కుడి భుజంపై పడితే, అది శుభ సూచకం. ఎడమ భుజంపై పడితే అశుభ సూచకంగా పరిగణిస్తారు.

(ఈ సమాచారానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వాటితో టివీ9 ఛానల్, టీవీ9 వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం లేదని మనవి.)