ఉత్తరాఖండ్‌ను కేవలం దేవతల భూమి అని పిలుస్తారు. ఇక్కడ అనేక అద్భుత ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు చెందిన అద్భుత కథలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అందుకే ఇక్కడి ఆలయాలను సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఉత్తరాఖండ్‌లోని ఈ అద్భుత దేవాలయాలలో.. భక్తులు తప్పనిసరిగా దర్శించుకోవలనుకునే ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. అందమైన ప్రకృతితో పాటు రహస్యాలకు నెలవు ఈ ఆలయాలు.
ఈ ఆలయం ఉత్తరాఖండ్‌లోని పచ్చని కొండల మధ్య రాజధాని డెహ్రాడూన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఉంది. ఈ రహదారి నుంచి ముస్సోరీకి వెళ్ళవచ్చు. భారతదేశం అంతటా అనేక పురాణ కథలున్న శివాలయాలు ఉన్నప్పటికీ.. ఇక్కడ ఉన్న ఓ ఆలయం.. దీని ప్రత్యేకతతో.. ఇతర దేవాలయాల కంటే భిన్నంగా చేస్తుంది. ఈ శివాలయానికి శ్రావణ మాసంలో, శివరాత్రి సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలో ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించకూడదనే షరతుతో శివుని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఈ విషయం తెలియజేసేందుకు ఈ ఆలయంలో డబ్బులు కానుకలుగా సమర్పించడం పూర్తిగా నిషిద్ధం అని రాసి ఉన్న బోర్డు కనిపిస్తుంది. భక్తులు శివలింగానికి నీరు మాత్రమే సమర్పించగలరు. ఈ దేవాలయం డెహ్రాడూన్‌లోని ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి. దేశంలో ఎలాంటి విరాళాలను, కానుకలను స్వీకరించని ఆలయాల్లో ఇది ఒకటి.
శ్రీ ప్రకాశేశ్వర మహాదేవ ఆలయం ప్రధాన ఆకర్షణ ఇక్కడ ప్రతిష్టించిన శివలింగం. ఇది అరుదైన రాళ్లు, స్ఫటికాలతో తయారు చేయబడింది. క్రిస్టల్ అనేది ఒక రకమైన మంచు రాయి. ఈ క్రిస్టల్ మిలియన్ల సంవత్సరాలు మంచు గడ్డడం వలన ఏర్పడుతుంది. ఇది మెరిస్తూ పారదర్శకంగా, కఠినమైన రూపాన్ని కలిగి ఉంటుంది.
శ్రీ ప్రకాశేశ్వర మహాదేవ ఆలయం దాని ప్రత్యేక శిల్పకళకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ గోడలు ఎరుపు, నారింజ రంగులలో పెయింట్ చేయబడ్డాయి. మొత్తం ఆలయం పైభాగంలో 140-150 కంటే ఎక్కువ త్రిశూలాలు ఉన్నాయి. ఇవి ఆలయ అందాన్ని మరింత పెంచుతాయి.
ఈ ఆలయంలో భక్తులకు ప్రతిరోజూ జరిగే లంగర్ (భండారా) లో హల్వ, ఖీర్, శనగలు, పూరీలను ప్రసాదంగా ఇస్తారు. భక్తులకు టీని అందిస్తారు. ఆలయంలో టీ తాగిన భక్తులు తమ కప్పును తామే శుభ్రంగా కడగాల్సి ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు