Story of Khatu Shyam: రోబో టెక్నాలజీ మహాభారతంలోనే ఉందా.. బార్బరీక్ ఎవరో తెలుసా..కృష్ణుడు ఎందుకు చంపాడంటే..!

మహాభారతంలోని పాత్రల గురించి, కురు పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామం వీటన్నింటిని గురించి తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తి దాయకమే. ఇందులో ఉన్న నీతి, చాకచక్యం, రాజకీయం తరగని విజ్ఞానాన్ని అందిస్తుంది...

Story of Khatu Shyam: రోబో టెక్నాలజీ మహాభారతంలోనే ఉందా.. బార్బరీక్ ఎవరో తెలుసా..కృష్ణుడు ఎందుకు చంపాడంటే..!
Barbarik Temple
Surya Kala

|

Apr 12, 2021 | 8:00 PM

Story of Khatu Shyam: పంచమవేదం మహాభారతం.. తింటే గారెలే తినాలి.. వింటే భారతం వినాలి అన్న నానుడి మహాభారత విశిష్టత గురించి తెలుపుతుంది. మహా భారతం అదో మహా కావ్యం. ఆ కావ్యాన్ని కథల రూపంలో, సినిమాలు, సీరియల్స్ రూపంలో చూసి, చదివి ఆనందిస్తుంటాము. మహాభారతంలోని పాత్రల గురించి, కురు పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామం వీటన్నింటిని గురించి తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తి దాయకమే. ఇందులో ఉన్న నీతి, చాకచక్యం, రాజకీయం తరగని విజ్ఞానాన్ని అందిస్తుంది. మరి 18 రోజుల పాటు ఏకధాటిగా సాగిన కురుక్షేత్ర యుద్ధంలో మన దేశంలో 80 శాతం పురుష జనాభా మరణించిందని పురాణ కథలు చెబుతున్నాయి. ఇప్పటికీ మన దేశంలో జరిగిన అతి పెద్ద యుద్ధం కురుక్షేత్ర సంగ్రామమేనని భావిస్తారు. అసలు కురుక్షేత్ర సంగ్రామాన్ని క్షణాల్లో ముగించే శక్తి సామర్థ్యాలు ఒకరికే ఉన్నాయట. ఘటో్త్కచుడి కొడుకు, భీముడికి మనవడు అయిన బార్బరిక్. కానీ యుద్దం మొదలవకముందే శ్రీకృష్ణుడు బార్బరిక్‌ని చంపేశాడట. అసలు శ్రీకృష్ణుడు బార్బరిక్‌ని ఎందుకు చంపాడో తెలుసుకుందాము..

ఘటోత్కచుని భార్య పేరు మౌర్వి (అహిళావతి) ఈ దంపతుల కుమారుడు బార్బరిక్. చిన్నప్పుడే అన్ని విద్యల్లో ఆరితేరాడు. అతని విద్యలకు మెచ్చిన పరమ శివుడు అతనికి మూడు అత్యంత శక్తివంతమైన బాణాలను అనుగ్రహించాడు. ఆ మూడు బాణాలతో అతనికి ముల్లోకాలలోనూ తిరుగులేదంటూ వరాన్ని అందించారు. పాండవులు, కౌరవుల మధ్య సమరం మొదలైందని తెలుసుకున్న బార్బరిక్ తను కూడా యుద్ధంలో పాల్గొనడానికి బయలు దేరతాడు. కుమారుడి యుద్ద విద్యలు తెలిసిన అతడి తల్లి మౌరి ఓడిపోయేవారికి అండగా ఉండి వారికి గెలుపుని అందించవలసిందిగా అతడి చేత ఒట్టు వేయించుకుని పంపిస్తుంది.

బార్బరిక్ యుద్దానికి బయలు దేరిన విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు అతడ్ని పరీక్షించదలిచి, ముసలి బ్రాహ్మణుడి వేషం ధరించి మార్గ మధ్యలో బార్బరిక్‌ని కలుస్తాడట… వీరుడు యుద్దానికి బయలుదేరాడని హేళన చేయసాగాడట బార్బరిక్‌ని ఉద్దేశించి శ్రీకృష్ణుడు… అందుకు తన దగ్గర మూడు బాణాలున్నాయని అందులోని బాణాలు ప్రయోగిస్తే చాలు శత్రు సైన్యం మట్టి కరుస్తుందని అన్నాడు బార్బరిక్. మొదటి బాణం వేస్తే తను ధ్వంసం చేయాలనుకున్న వాటికి గుర్తులు పెట్టి వస్తుందని, రెండవ దానిని వేస్తే అది తను కాపాడాలనుకున్న వాటికి గుర్తు పెట్టి వస్తుందని, మూడవ బాణం వేస్తే అది మిగిలిన అన్నింటినీ ధ్వంసం చేస్తుందని చెప్పాడు.

ఇంతగా చెప్పినప్పటికీ శ్రీకృష్ణుడు బార్బరిక్‌ని హేళన చేయడం ఆపలేదు. పక్కనే ఉన్న రావి చెట్టుపై ప్రయోగించి చూపమన్నాడు. బార్బరికుడు ఆ పరమ శివుడ్ని తలచుకొని బాణం ప్రయోగించడానికి కళ్లు మూసుకోగా శ్రీకృష్ణుడు టక్కున ఓ రావి ఆకుని తీసుకొని తన అరికాలు కింద పెట్టాడట. బార్బరికుడు వేసిన బాణం రావి చెట్టు మీద ఉన్న అన్ని ఆకులు గుర్తించి చివరకు కృష్ణుడి అరికాలు వద్దకు వచ్చి ఆగింది. విషయం బోధపడిన కృష్ణుడు పాండవుల తరపున యుద్ధం చేయాలని అడుగుతాడు. కానీ తాను తల్లికి ఇచ్చిన మాట ప్రకారం ఓడిపోయే వారిపై యుద్ధం చేస్తానంటాడు బార్బరిక్.

అప్పటికి వదిలేసి మరోసారి అతడి ముందు ఓ వ‌ృద్దుడి రూపంలో ఎదురొచ్చి ఒక వరం అడుగుతాడు. దానికి బార్బరికుడు ఏం కావాలన్న ఇస్తానంటాడు. దానికి ఆ వృద్దుడు నీ తల కావాలని అడుగుతాడట. ఇతడు సామాన్యుడు కాదని తలచిన బార్బరికుడు ఇచ్చిన మాట ప్రకారం తల ఇస్తాను కానీ నీ అసలు రూపం చూపించమని అడుగుతాడు. అందుకు వెంటనే శ్రీకృష్ణుడు తన అసలు రూపం దాలుస్తాడు. అయితే తలను నరికి ఇచ్చే ముందు బార్బరికుడు శ్రీకృష్ణుడిని ఓ కోరిక కోరతాడట. కురుక్షేత్ర యుద్ధం జరిగినంత సేపు తాను ఆ యుద్దాన్ని చూస్తానని కోరతాడు. అందుకు అంగీకరించిన శ్రీకృష్ణుడు బార్బరిక్ తలను ఎత్తైన పర్వతం మీద పెడతాడట. యుద్ధం ముగిసిన తరువాత బార్బరిక్ తలను రూపనదిలో వదిలేస్తాడట శ్రీకృష్ణుడు. అలా వదిలేసిన తల కలియుగంలో రాజస్థాన్‌లోని కార్టో గ్రామంలో లభించిందని, అప్పటి రాజు బార్బరికునికి గుడి కట్టించారని పండిత పెద్దలు చెబుతుంటారు.

Also Read: ఆ దేశంలోని ఆటవిక తెగవారు ఆవును పవిత్రమైన జంతువుగా పూజిస్తారు.. ఎందుకంటే..! 

తండ్రి ఇన్స్పిరేషన్‌తో మొదటి ప్రయత్నంలో ఐపీఎస్‌కు సెలక్ట్ అయిన తెలుగింటి ఆడపడుచు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu