Vinayaka Chavithi: ఇవాళ్టి నుంచి భక్తులకు ఖైరతాబాద్ గణపయ్య దర్శనం.. మండపం వైపు ట్రాఫిక్ ఆంక్షలు

|

Aug 31, 2022 | 12:27 PM

 ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి గా దర్శనం ఇస్తున్నారు. ఈసారి ప్రత్యేకించి 50 అడుగుల మట్టి గణేష్ ని తయారు చేశారు.

Vinayaka Chavithi: ఇవాళ్టి నుంచి భక్తులకు ఖైరతాబాద్ గణపయ్య దర్శనం.. మండపం వైపు ట్రాఫిక్ ఆంక్షలు
Khairatabad Ganesh 2022
Follow us on

Vinayaka Chavithi: దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ వచ్చేసింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ వినాయక మండపాల్లో కొలువుదీరి 10 రోజులపాటు భక్తులతోపూజలను అందుకోవడానికి బొజ్జ గణపయ్య రెడీ అవుతున్నాడు. చవితి వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. వినాయ‌క చ‌వితి పండుగ‌ వ‌స్తుందంటే అంద‌రి మ‌దిలో ముందుగా మెదిలేది ఖైర‌తాబాద్ గణపతినే.. భారీ ఆకారంలో దర్శనం ఇచ్చే ఖైరతాబాద్ గణపతికి నగరంలోనే కాదు.. ఇరు తెలుగురాష్ట్రాల్లో కూడా ప్రత్యేక ప్రత్యేక గుర్తింపు ఉంది.

రేపే (బుధవారం) వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ వినాయకుడు నేటి నుంచి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. గణేష్ విగ్రహ తయారీ పూర్తైన నేపథ్యంలో కర్రలను తొలగించారు. పూర్తి స్తాయిలో భారీ గణపయ్య భక్తులకు నవరాత్రుల్లో దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నుంచి ఖైరతాబాద్ మండపం వైపు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.

ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి గా దర్శనం ఇస్తున్నారు. ఈసారి ప్రత్యేకించి 50 అడుగుల మట్టి గణేష్ ని తయారు చేశారు. గణనాథుడికి ఇరువైపులా త్రిశక్తి మహా గాయత్రి, షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి దర్శనమిస్తున్నారు. బుధవారం వినాయక చవితి పండుగ కావడంతో అన్ని శాఖల సమన్వయంతో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ కొలువైన గణపతిని నవరాత్రుల్లో దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..