Kartik Swami Temple: మేఘాలలో తేలియాడే ఆలయం.. కార్తికేయుడి ఎముకలకు పూజలు.. ఎక్కడ ఉందంటే

|

Jul 01, 2024 | 11:51 AM

ఉత్తరాఖండ్‌లో ప్రకృతి, ఆధ్యాత్మిక విశ్వాసాల అద్వితీయ సంగమాన్ని చూడవచ్చు. అలాంటి ఆలయాల్లో ఒకటి కార్తీక స్వామి ఆలయం. ఇది ఎత్తైన శిఖరంపై ఉంది. ఈ ఆలయం వైభవం, పురాణాలు, ప్రాముఖ్యత ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉండటమే కాదు అదే సమయంలో ఆలయం చుట్టూ ఉన్న దృశ్యం కూడా భక్తులను ఆకర్షిస్తుంది. కార్తీక స్వామి దేవాలయం ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. ఇది రుద్రప్రయాగ పోఖారి రహదారిపై కనక్ చౌరి గ్రామ సమీపంలో 3050 మీటర్ల ఎత్తులో క్రాంచ్ కొండపై ఉంది. శివపార్వతుల కుమారుడైన కార్తికేయుడు.. ఎముకల రూపంలో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు

Kartik Swami Temple: మేఘాలలో తేలియాడే ఆలయం.. కార్తికేయుడి ఎముకలకు పూజలు.. ఎక్కడ ఉందంటే
Kartik Swami Temple
Follow us on

హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న అందమైన రాష్ట్రం ఉత్తరాఖండ్‌. ఇక్కడ అందమైన దృశ్యాలు కనులకు విందు చేస్తే ఆధ్యాత్మిక ప్రదేశాలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇక్కడ దేవతలు, దేవుళ్లకు సంబంధించిన పురాతన, గొప్ప ఆలయాలు కూడా ఉన్నాయి. మరో మాటలో చెప్పాలంటే.. ఉత్తరాఖండ్‌లో ప్రకృతి, ఆధ్యాత్మిక విశ్వాసాల అద్వితీయ సంగమాన్ని చూడవచ్చు. అలాంటి ఆలయాల్లో ఒకటి కార్తీక స్వామి ఆలయం. ఇది ఎత్తైన శిఖరంపై ఉంది. ఈ ఆలయం వైభవం, పురాణాలు, ప్రాముఖ్యత ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉండటమే కాదు అదే సమయంలో ఆలయం చుట్టూ ఉన్న దృశ్యం కూడా భక్తులను ఆకర్షిస్తుంది.

ఈ ఆలయం ఎక్కడ ఉందంటే

కార్తీక స్వామి దేవాలయం ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. ఇది రుద్రప్రయాగ పోఖారి రహదారిపై కనక్ చౌరి గ్రామ సమీపంలో 3050 మీటర్ల ఎత్తులో క్రాంచ్ కొండపై ఉంది. శివపార్వతుల కుమారుడైన కార్తికేయుడు.. బాల్య రూపంలో భక్తులకు దర్శనం ఇస్తాడు. ఉత్తర భారతదేశంలో కార్తికేయుడు బాల్య రూపంలో ఉన్న ఏకైక ఆలయం ఇది.

ఆలయానికి సంబంధించిన పౌరాణిక కథ

పురాణాల ప్రకారం ఒకసారి శివుడు తన ఇద్దరు కుమారులు కార్తికేయుడిని, గణేశుడిని విశ్వానికి 7 ప్రదక్షిణలు చేయమని కోరాడు. తన తండ్రి ఆజ్ఞను అందుకున్న వెంటనే కార్తికేయుడు విశ్వానికి ఏడు ప్రదక్షిణలు చేయడానికి బయలుదేరాడు. గణపతి తన తల్లిదండ్రులను ఏడు ప్రదక్షిణలు చేసి తన విశ్వమంతా తల్లిదండ్రులే అని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

సతీదేవి శక్తిపీఠం

గణేశుడి మాటలు విన్న శివపార్వతులు చాలా సంతోషించారు. ఇక నుంచి మొదట పూజను అందుకుంటావని గణపతిని ఆశీర్వదించారు. మరోవైపు కార్తియుడు విశ్వానికి 7 ప్రదక్షిణలు పూర్తి చేసి తిరిగి వస్తాడు. అప్పుడు అసలు విషయం తెలిసి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు. దీని తరువాత కోపోద్రిక్తుడైన కార్తికేయుడు తన మాంసాన్ని, ఎముకలను పరమశివునికి అర్పించగా.. ఈ ఆలయంలో కార్తికేయుని ఎముకలకు పూజలు చేస్తారు.

గంటల శబ్దం వినబడుతుంది

కార్తీక స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. దక్షిణ భారతదేశంలో ఉన్న కార్తీక స్వామిని మురుగన్ అని కూడా అంటారు. ఆలయ ప్రాంగణంలో వేలాడదీసిన వందలాది గంటల శబ్దం సుమారు 800 మీటర్ల దూరం వరకు వినబడుతుంది. ఇక్కడ రోడ్డు నుండి 80 మెట్లు ఎక్కి ఆలయ గర్భగుడిని చేరుకోవచ్చు.

ఎలా చేరుకోవాలంటే

కార్తీక స్వామిని చేరుకోవడానికి హరిద్వార్ లేదా రిషికేశ్ నుండి రుద్రప్రయాగకు బస్సు ఎక్కడం ఉత్తమ మార్గం. కార్తీక స్వామి దేవాలయం రుద్రప్రయాగ నుంచి పోఖారీ మార్గంలో సుమారు 40 కి.మీ. దూరంలో ఉంది. రుద్రప్రయాగ్ నుండి టాక్సీని అద్దెకు తీసుకోవచ్చు లేదా షేరింగ్ టాక్సీ లో చేరుకోవచ్చు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు