Kartika Masam: ప్రీతికరం కార్తీక మాసం విశిష్టత.. ఆచరించాల్సిన పద్ధతుల గురించి తెలుసుకోండి..

|

Nov 06, 2021 | 9:34 AM

కార్తీక మాసం.. ఆది దేవుడికి ఎంతో ప్రీతికరం. శివుడు.. గంగాదేవి.. పార్వతి దేవికి కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అంటుంటారు.

Kartika Masam: ప్రీతికరం కార్తీక మాసం విశిష్టత.. ఆచరించాల్సిన పద్ధతుల గురించి తెలుసుకోండి..
Karthikamasam
Follow us on

కార్తీక మాసం.. ఆది దేవుడికి ఎంతో ప్రీతికరం. శివుడు.. గంగాదేవి.. పార్వతి దేవికి కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అంటుంటారు. ఈ మాసంలో వ్రతాలు.. నోములతోపాటు..దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆశ్వయుజ అమావాస్య మరుసటి రోజు కార్తీకమాస పాడ్యమి నుంచి కార్తీక అమావాస్య వరకు కార్తీక మాసం ఉంటుంది. ఈ మాసం శివారాధన చేయడం వలన పుణ్యఫలాల్ని ఇస్తాయి. ఈమాసంలో ఉపవాసాలు ఆచరించడం వలన ఎన్నో శుభఫలితాలుంటాయి.

కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేసి దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత శివుడిని పూజిస్తే పుణ్యఫలం లభిస్తుంది. దైవచింతన అవసరం. ఈ మాసంలో ముఖ్యమైన రోజు ద్వాదశి క్షీరాబ్ది. ద్వాదాశి నాడు పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు కనబడుతుంది. కార్తీక మాసంలో ప్రతి రోజూ దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది. ప్రతిరోజూ పూజ చేయలేనివారు క్షీరాబ్ది ద్వాదశి రోజు దీపాలు వెలిగించుకుని పూజ చేస్తే పుణ్యఫలం పొందుతుంది. కార్తీకమాసంలో సోమవారాలు అత్యంత పవిత్రమైనవి. శివుడిని ఆరాధించడం.. పంచామృతాలతో అభిషేకించడం.. నదీ స్నానాలు చేయడం.. చాలా మంచిది. కార్తీక పౌర్ణమి రోజున శివుడిని పూజించి జ్వాలాతోరణం దర్శించుకోవాలి. అలాగే కార్తీక మాసంలో వనభోజనాలు కూడా నిర్వహిస్తారు. కార్తీక సోమవారం రోజున ఉదయాన్నే శివాలయానికి వెళ్లి దీపారాధన చేసి పగలంతా ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత సాయంత్రం నమకం, చమకం. పురుష, శ్రీ సూక్తాదులతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయాలి. కార్తీక శుద్ద ద్వాదాశి రోజున తులసి కోట వద్ద ఉసిరి కొమ్మ ఉంచాలి. తులసి కోటను లక్ష్మీ స్వరూపంగా .. ఉసిరిని మహా విష్ణువుగా భావించి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఆచరించాలి.

Also Read: Oke Oka Jeevitham: ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న ఒకే ఒక జీవితం.. ఆకట్టుకుంటున్న శర్వానంద్ న్యూ పోస్టర్..

Balakrishna: బాలయ్యతో జతకట్టనున్న శృతీ.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్‌.. ఆసక్తిని రేకెత్తిస్తోన్న టైటిల్‌.

Bigg Boss 5 Telugu: ప్రియాంక పరువుతీసిన మానస్.. కంటెంట్ కోసం చేస్తున్నావంటూ..

Aevum Jagat Teaser: ‘ఇది కలాం కలలు కన్న దేశం కాదు.. బాపు సాధించిన స్వతంత్రం కాదు’.. ఆసక్తికరంగా ఏవం జగత్‌ టీజర్‌.