
నవ గ్రహాలకు అధినేత సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు. ఇలా సంచారం చేయడాన్ని సంక్రాంతి అని అంటారు. రేపు (సెప్టెంబర్ 17న )సూర్యుడు కన్యారాశిలో అడుగు పెట్టనున్నాడు. ఇది వేద జ్యోతిషశాస్త్రం, హిందూ ఆచారాలలో చాలా పవిత్రమైన సమయం. ఈ కాలం పితృ తర్పణం, దానధర్మాలు, ఆధ్యాత్మిక శుద్ధి, పూర్వీకుల ఆశీర్వాదాలను పొందడానికి అనువైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున సాంప్రదాయ ఆచారాలను నిర్వహించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ఆర్ధిక, ఆరోగ్య శ్రేయస్సుతో పాటు పితృ శాంతి లభిస్తుంది.
కన్యా సంక్రాంతి ప్రాముఖ్యత
జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించినప్పుడు.. అది పూర్వీకుల శాంతికి, దానధర్మాలకు చాలా పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది. కన్య రాశి జ్ఞానం, సేవ, మతం , కర్మలకు చిహ్నం. కనుక కన్య సంక్రాంతి రోజున చేసే కర్మలు , దానధర్మాలు శాశ్వత ఫలాలను ఇస్తాయి. ఈ సమయంలో సూర్య దేవుడు పితృలోక ద్వారాలను తెరుస్తాడని , పూర్వీకులు తమ వారసుల ఇచ్చే తర్పణం, శ్రద్ధ కర్మలను స్వీకరిస్తారని నమ్మకం.
సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించడంతో ధనుస్సు, మీనం, వృషభ రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగాలు, వ్యాపారం, విద్యా రంగంలో కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. మరోవైపు మిథునం, తుల రాశి వారు ఈ సమయంలో ఓర్పు, నిగ్రహం కలిగి ఉండాలి. కన్యా సంక్రాంతి కేవలం రాశి మార్పు మాత్రమే కాదు. పూర్వీకులకు కృతజ్ఞత తెలిపే సమయం. ఈ రోజున స్నానం చేయడం, దానాలు చేయడం, పూర్వీకులకు తర్పణం అర్పించడం ద్వారా వ్యక్తీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందుతాడు. జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు