Kanipakam: చవితి వేడుకలకు కాణిపాక వినాయక ఆలయం సిద్ధం.. రేపటి నుంచి 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఆర్జిత సేవలు రద్దు

|

Aug 30, 2022 | 12:23 PM

బుధవారం (ఆగష్టు 31వ తేదీ) నుంచి 21 రోజుల పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఈవో సురేష్ చెప్పారు. రేపు తెల్లవారుజామున ఒంటి గంటకి స్వామివారికి ప్రత్యేక అభిషేకంతో చవితి వేడుకలు  ప్రారంభంకానున్నాయన్నారు.

Kanipakam: చవితి వేడుకలకు కాణిపాక వినాయక ఆలయం సిద్ధం.. రేపటి నుంచి 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఆర్జిత సేవలు రద్దు
Kanipakam Temple
Follow us on

Kanipakam: చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం. ఇక్కడ వెలసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కాణిపాకం ఆలయ ఈవో సురేష్ బాబు చెప్పారు. రేపటి నుంచి వినాయక చవితికి వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయంలో 21 రోజులు పాటు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలుజరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.  500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. వినాయక చవితి రోజున ఉదయం 10 గంటల నుంచి భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని భావిస్తున్న ఆలయ సిబ్బంది.. ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. విఐపి లకు, సాధారణ భక్తులకు వేరువేరు లైన్ లు ఏర్పాటు చేశారు. భక్తులకు  70 వేల లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంచనున్నారు. , 104 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు.

అంతేకాదు బుధవారం (ఆగష్టు 31వ తేదీ) నుంచి 21 రోజుల పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఈవో సురేష్ చెప్పారు. రేపు తెల్లవారుజామున ఒంటి గంటకి స్వామివారికి ప్రత్యేక అభిషేకంతో చవితి వేడుకలు  ప్రారంభంకానున్నాయన్నారు. అనంతరం భక్తులకు 3 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం లభించనున్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి