Vastu Tips: జీవితంలో సుఖ సంపదల కోసం ప్రజలు వాస్తు సహాయం కూడా తీసుకుంటారు. వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం ఇంటిని ఏర్పాటు చేసుకోవడం చాలా ఉత్తమమైందిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది దోషాలను తొలగిస్తుంది. అనేక ప్రయోజనాలను ఇస్తుంది. వాస్తు (ఇంటికి వాస్తు చిట్కాలు) ప్రకారం, ఇంట్లో కామధేను ఆవు విగ్రహాన్ని ఉంచడం కూడా మంచిదని భావిస్తారు. కామధేనువు సముద్ర మథన సమయంలో జన్మించిందని నమ్ముతారు. కామధేనువు కృప ఎవరిపై ఉంటుందో వారి ప్రతి కోరికను నెరవేరుస్తుందని చెప్పబడింది. నందిని అని పిలువబడే కామధేను ఆవు విగ్రహంలో ఒక దూడ కనిపిస్తుంది. తల్లిలా ఇంట్లోనే ఉంటూ రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. కామధేను ఆవు విగ్రహం కూడా ఒక శక్తిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే వాస్తు ప్రకారం ఇది దుర్గ, లక్ష్మీ దేవి, సరస్వతి దేవి లక్షణాలను కలిగి ఉంది. కామధేను ఆవు విగ్రహాన్ని ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి.. అందువలన కలిగే లాభాల గురించి ఈరోజు తెలుసుకుందాం..
ఏ దిశలో కామధేనువు ఉంచాలంటే..
మీరు ఇంట్లో కామధేను ఆవు విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకుంటే.. ఇంటికి ఈశాన్య దిశలో ఉంచండి. దేవతలు ఈ దిశలో నివసిస్తారు. కనుక ఈ పవిత్ర స్థలంలో ఈ విగ్రహాన్ని ఉంచడం వలన ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పబడింది.
ఏ గదిలో ఈ విగ్రహాన్ని ఉంచాలంటే..
చాలా మంది హిందువుల ఇంటిలో పూజ కోసం ఒక గదిని కేటాయిస్తారు. మీరు ఈ పవిత్ర స్థలంలో కామధేను అంటే ఆవు దూడ కలిసి ఉన్న విగ్రహాన్ని ఉంచవచ్చు. లేదంటే ఈ విగ్రహాన్ని మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఉంచుకోవచ్చు. ఇలా చేయడం శ్రేయస్కరం, ఎందుకంటే ఒకప్పుడు ప్రజలు ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవులను లక్ష్మీదేవిగా భావించి ఉంచేవారు. ఈ సంప్రదాయం గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ కనిపిస్తుంది. గోవు సిరి సంపదలకు చిహ్నంగా భావిస్తారు.
ఎలాంటి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవాలంటే..
కామధేను ఆవు, దూడతో కలిసిన విగ్రహం అనేక రకాల వస్తువు రూపంలో మార్కెట్‌లో ఉంది. అవకాశం ఉన్నవారు ఇంట్లో కామధేను ఆవు వెండి విగ్రహాన్ని తెచ్చుకోవడం శుభప్రదం. వెండికి చాలా ప్రాముఖ్యత ఉంది. కావాలంటే ఈ పవిత్ర విగ్రహాన్ని జేబులో పెట్టుకునే విధంగా కూడా తెచ్చుకోవచ్చు. ఆర్ధిక శక్తి కొలది రాగి లేదా ఇత్తడి విగ్రహాన్ని కూడా ఇంట్లో ఏర్పాటు చేసుకోవచ్చు.
(ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఇచ్చింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..