Jyeshtha Month Daan: ఈ మాసంలో ఈ దానాలు చేసి చూడండి..ఇళ్లు ఐశ్వర్యం, ఆనందంతో నిండిపోతుంది

|

May 27, 2023 | 9:10 AM

మే 25 నుండి రోహిణి కార్తి ప్రారంభమైంది. అటువంటి పరిస్థితిలో సూర్యుడు ఈ పక్షం రోజులు నిప్పుల వర్షం కురిపిస్తాడు. మనుషులు, పక్షులు, జంతువులు కూడా ఎండ వేడికి గురవుతాయి.  అటువంటి పరిస్థితిలో దానం చేయడం ద్వారా మీకు పుణ్యం లభిస్తుంది. భగవంతుడు సంతోషిస్తాడు.

Jyeshtha Month Daan: ఈ మాసంలో ఈ దానాలు చేసి చూడండి..ఇళ్లు ఐశ్వర్యం, ఆనందంతో నిండిపోతుంది
Jyeshtha Month Daan
Follow us on

హిందూ మతంలో తెలుగు నెలలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ నేపథ్యంలో జ్యేష్ఠ మాసాన్ని అనేక విధాలుగా ప్రత్యేకంగా భావిస్తారు. ప్రస్తుతం జ్యేష్ఠ మాసం శుక్ల పక్షం జరుగుతోంది.. ఇది జూన్ 4 వరకు ఉంటుంది. ఈ మాసంలో దాతృత్వానికి  సంబంధించిన నియమనిబంధనలున్నాయి. జ్యేష్ఠ మాసంలో చాలా వేడిగా ఉంటుంది. మే 25 నుండి రోహిణి కార్తి ప్రారంభమైంది. అటువంటి పరిస్థితిలో సూర్యుడు ఈ పక్షం రోజులు నిప్పుల వర్షం కురిపిస్తాడు. మనుషులు, పక్షులు, జంతువులు కూడా ఎండ వేడికి గురవుతాయి.  అటువంటి పరిస్థితిలో దానం చేయడం ద్వారా మీకు పుణ్యం లభిస్తుంది. భగవంతుడు సంతోషిస్తాడు. ఎవరైతే ఇతరుల బాధలు, కష్టాలు అర్థం చేసుకుంటారో .. వారికి సహాయం చేస్తారో, అలాంటి వారిపై లక్ష్మీదేవి  ఆశీర్వాదాన్ని అందిస్తుంది. అందుకే జ్యేష్ఠ మాసంలో చేయాల్సిన దానం గురించి తెలుసుకుందాం..

  1. జ్యేష్ఠ మాసంలో తీవ్రమైన వేడి ఉంటుంది. ప్రజలకు నీరు అత్యంత అవసరం. దారిలో వెళ్లేవారికి నీళ్లు లేదా షర్బత్ ఇస్తే దేవుడితో పాటు పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి.
  2. వేసవి కాలంలో జంతువులు, పక్షులు చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అదేంటంటే  మూగజీవాలకు నీరు ఇవ్వడం ఎప్పుడూ పుణ్యమే. అయితే జ్యేష్ఠ మాసంలో మీరు బహిరంగ ప్రదేశాల్లో జంతువులు, పక్షులకు నీటిని ఉంచినట్లయితే.. అది చాలా శుభప్రదంగా ఉంటుంది.
  3. జ్యేష్ఠ మాసంలో చల్లటి వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అలాంటి వాటిని పేదలకు దానం చేయడం ద్వారా భగవంతుడు సంతోషించి వారి దుఃఖాలను దూరం చేస్తాడు.
  4. జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలో 15 రోజుల పాటు పక్షులకు, జంతువులకు నీరు ఇవ్వడం పురోభివృద్ధికి బాటలు వేస్తుంది. అందుకే వివిధ ప్రాంతాలలో నీటి కోసం ఏర్పాట్లు చేయాలి.
  5. ఇవి కూడా చదవండి
  6. ఈ మాసంలో మొక్కలకు నీరు పెట్టవారికి ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. చెట్లు, మొక్కల వలె, మానవ జీవితం కూడా వికసించడం ప్రారంభమవుతుంది.
  7. జ్యేష్ఠ మాసాన్ని మంగళ దేవుడికి సంబంధించినదిగా భావిస్తారు. అందుకే ఈ మాసంలో బెల్లం, గొడుగు, బూట్లు-చెప్పులు, కాటన్ బట్టలు, నువ్వులను దానం చేయడం మంచిది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).