CJI NV Ramana: శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివారిని ద‌ర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ దంప‌తులు..

|

Jun 18, 2021 | 10:45 AM

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి(CJI) జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ దంప‌తులు ద‌ర్శించుకున్నారు. హైద‌రాబాద్ నుంచి శుక్రవారం ఉద‌యం బ‌య‌లుదేరి..

CJI NV Ramana: శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివారిని ద‌ర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ దంప‌తులు..
Cji Nv Ramana Srisailam Dha
Follow us on

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి(CJI) జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ దంప‌తులు ద‌ర్శించుకున్నారు. హైద‌రాబాద్ నుంచి శుక్రవారం ఉద‌యం బ‌య‌లుదేరి శ్రీశైలం వెళ్లిన సీజేఐకు ఆలయ అధికారులు  స్వాగ‌తం ప‌లికారు. అనంతరం ఆలయం వద్ద NV రమణ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి NV రమణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఎన్వీ రమణ దంపతులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు.

ఈ మేరకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

శుక్రవారం ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌ నుంచి రహదారి మార్గంలో బయలుదేరిన సీజేఏ సరిగ్గా ఉదయం 8.45 గంటలకు దేవస్థానం అతిథిగృహానికి చేరుకున్నారు.అనంతరం అమ్మావారిని, స్వామివారిని దర్శించుకున్న అనంతరం రమణ దంపతులు తిరిగి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యటన సందర్భంగా శ్రీశైలం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Tipu Sultan: సీఎం జగన్ సొంత జిల్లాలో కొత్త వివాదం.. టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటుపై కమలం నేతల ఆందోళన