Narasimha Jharni : ఈ క్షేత్ర దర్శనం.. మన దేశంలో ఉన్న అన్ని ఆలయాల కంటే భిన్నం, 600 మీటర్ల లోతు నీటిలో ప్రయాణం

|

Feb 27, 2021 | 5:49 PM

భారత దేశం ఆధ్యాత్మిక నిలయం. రొటీన్ పనలకు స్వస్తి చెప్పి..మనస్సు ప్రశాంతత కోసం మనం విహార యాత్రలను.. చేస్తుంటాము.. కాగా ఈ విహార యాత్రాల్లో ఎక్కువగా ఆలయాలను ఎంచుకుంటాము. అలా తప్పని సరిగా...

Narasimha Jharni : ఈ క్షేత్ర దర్శనం.. మన దేశంలో ఉన్న అన్ని ఆలయాల కంటే భిన్నం, 600 మీటర్ల లోతు నీటిలో ప్రయాణం
Follow us on

Narasimha Jharni : భారత దేశం ఆధ్యాత్మిక నిలయం. రొటీన్ పనలకు స్వస్తి చెప్పి..మనస్సు ప్రశాంతత కోసం మనం విహార యాత్రలను.. చేస్తుంటాము.. కాగా ఈ విహార యాత్రాల్లో ఎక్కువగా ఆలయాలను ఎంచుకుంటాము. అలా తప్పని సరిగా దర్శించుకొనే ఆలయంలో ఒకటి ఝర్ణీ నరసింహక్షేత్రం.. క్రీ.పూ 400 ల ఏళ్ల క్రితం ఈ క్షేత్రం లో స్వామివారు కొలువై ఉన్నారు. ఈ క్షేత్ర దర్శనం.. మన దేశంలో ఉన్న అన్నీ ఆలయాల కంటే భిన్నమైనది.. ప్రత్యేకత కలిగి ఉన్నది.

బీదర్… కర్నాటక రాష్ట్రంలో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా… చుట్టూ కొండలు, పచ్చని ప్రశాంతమైన వాతావరణం నడుమ బీదర్ కు దగ్గరలో ఉన్న మంగళ్ పేట్ లో నరసింహ క్షేత్రం వెలసింది. ఈ క్షేత్రం లో ఉండే స్వామికి జల నరసింహుడు అనే పేరు.. ఈ ఝరణీ నరసింహ స్వామిని దర్శించుకోవాలంటే… ఒక గుహ లో మనిషి లోతుగా ప్రవహించే నీటిలో నడుచుకుంటూ వెళ్ళాలి. అలా 600 మీటర్లు లోపలికి నీటిగుండా ప్రయాణం చేస్తే గుడి వస్తుంది.

జలనరసింహుడు అనే పేరు ఎలా వచ్చిందంటే…

శివుడు ఈ కొండ గుహలో తపస్సులో వుండగా జలాసుర అనే రాక్షసుడు సర్వ విధాల తపోభంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నృసింహస్వామిగా అవతారమెత్తిన విష్ణు మూర్తి హిరణ్యకశిపుని ఖండించి అడవి ప్రాంతంలో సంచరిస్తుండగా శివుని వ్రత భంగం చూసి కోపోద్రిక్తుడై జలాసురుడిని నృసింహుడు ఖండించాడు. రాక్షసుడైనా కొద్దిగా చేసిన పుణ్యంతో నరసింహ స్వామి ఏదైనా ఒక మంచి కోరిక కోరుకో తీరుస్తానని అడగగా… జలసురుడు చివరి ఘడియలో నృసింహస్వామిని ఒక కోరిక కోరుకున్నాడు. నువ్వు ఇక్కడ వెలవాలి.. నిన్ను నా పేరుతో కలిసి పిలవాలి అదే వరంగా ఇవ్వమని జలసురుడు కోరాడట. జలసురుడి కోరిక తీర్చడం కోసం ఆ గుహలో వెలసిన నరసింహస్వామి అప్పటి నుంచి జలానరసింహుడి గా కొలవబడుతున్నాడు.

బీదర్ కు ఎలా చేరుకోవాలంటే..

హైదరాబాద్ నుంచి బీదర్ 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. మూడు గంటల ప్రయాణం. ఇక్కడకు చేరుకోవడానికి బస్సు, రైలు సదుపాయం కూడా కలదు.

బీదర్ కు గల పేర్లు:

మహాభారత కాలంలో విదూరానగరం, అహ్మద్ షా పరిపాలన కాలంలో అహ్మదాబాద్ బీదర్ గా మార్పు చెందింది.

Also Read:

: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం..

తీర్థయాత్రలకు వెళ్లేవారు తెలుసుకోవల్సిన విషయాలు.. శ్రీకృష్ణుడు పాండవులకు ఇచ్చిన సందేశంలోని అంతర్యాం..