Jagannath Rath Yatra: ఈ నెల 20న పూరి రథయాత్ర ప్రారంభం.. అన్నాచెల్లెలతో కన్నయ్య నగర విహారం..

|

Jun 06, 2023 | 6:58 AM

ఈ ఏడాది పూరి జగన్నాథుడి రథ యాత్ర 20 జూన్ 2023 మంగళవారం రోజున ప్రారంభం కానుంది. ఈ ప్రయాణంలో జగన్నాథుడు .. తన అన్న బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి రథయాత్రను చేస్తాడు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ తీర్థయాత్రలో పాల్గొనే ఏ భక్తుడైన సరే అన్ని తీర్థయాత్రల ఫలాలను పొందుతాడు.

Jagannath Rath Yatra: ఈ నెల 20న పూరి రథయాత్ర ప్రారంభం.. అన్నాచెల్లెలతో కన్నయ్య నగర విహారం..
Jagannath Rath Yatra 2023
Follow us on

హిందూ మతంలో పూరి జగన్నాథుని రథ యాత్ర చాలా పవిత్రమైనది. పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది. పంచాంగం ప్రకారం జగన్నాథ యాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్ల పక్షం రెండవ తేదీన జరుగుతుంది. ఈ ఏడాది పూరి జగన్నాథుడి రథ యాత్ర 20 జూన్ 2023 మంగళవారం రోజున ప్రారంభం కానుంది. ఈ ప్రయాణంలో జగన్నాథుడు .. తన అన్న బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి రథయాత్రను చేస్తాడు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ తీర్థయాత్రలో పాల్గొనే ఏ భక్తుడైన సరే అన్ని తీర్థయాత్రల ఫలాలను పొందుతాడు. ఈ యాత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

  1. హిందూ మత విశ్వాసాల ప్రకారం జగన్నాథుడు విష్ణువు అవతారంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం అంగ రంగ వైభవంగా జరిగే ఈ రథయాత్రను శ్రీ జగన్నాథ పురి, పురుషోత్తమ పురి, శంఖ క్షేత్రం, శ్రీ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ యాత్రలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు.
  2. పురాణాల కథనం ప్రకారం శ్రీ జగన్నాథుని సోదరి సుభద్ర ఒకసారి ఈ నగరాన్ని చూడాలనే కోరికను వ్యక్తం చేసింది. ఆ తర్వాత జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి రథంపై కూర్చుని  నగరమంతా చుట్టి చూపించాడట. అప్పటి నుంచి ఈ రథయాత్ర చేపట్టే సంప్రదాయం కొనసాగుతోందని ప్రతీతి.
  3. రథం నిర్మాణానికి వేపచెట్టు కలపను ఉపయోగిస్తారు. ఈ ప్రత్యేకమైన చెక్కను దారు అంటారు. ఈ కలప ఎంపిక కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఎంపిక చేసిన చెట్ల కలపతో రథ నిర్మాణం చేస్తారు.
  4. హిందూ మత పరమైన ఆచారాల ప్రకారం.. జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జగన్నాథుడు 108 కుండలతో స్నానం చేస్తారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్నానం చేయడానికి నీటిని తీసే బావి సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరవబడుతుంది. అందుకే ఈ యాత్రను స్నాన్ యాత్ర అని కూడా అంటారు. ఈ యాత్ర తరువాత, భగవంతుడు 15 రోజుల తిరోగమనానికి వెళ్తాడు.
  5. ఇవి కూడా చదవండి
  6. జగన్నాథుడి ఆలయం నుండి బయలుదేరిన తరువాత జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలు నాజర్‌ను సందర్శించిన తర్వాత గుండిచా ఆలయానికి చేరుకుంటారు. గుడించా కృష్ణుడు మేనత్త ఇల్లు అని విశ్వాసం. ఇక్కడికి చేరుకున్న తరువాత కన్నయ్య తన మాతృమూర్తి చేసిన ఫుడ్ పీఠాన్ని స్వీకరిస్తాడు. ఆ తర్వాత ఏడు రోజులపాటు ఈ ఆలయంలో విశ్రాంతి తీసుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).